ManaEnadu: రైల్వే ఉద్యోగాల(Railway Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి వెస్ట్రన్(WR Apprentice) రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, వర్క్‌షాపులలో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తారు. వెస్ట్రన్ రైల్వే మహారాష్ట్రలోని ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహింస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైటhttps://rrc-wr.com/ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. SEP 23న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, గడువు OCT 22 వరకు ఉంటుంది.
అర్హత ప్రమాణాలు
పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడులో ITI పాసవ్వాలి. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, PSAA, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, Wiremen, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ AC, PIPE ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ వంటి ITI ట్రేడ్‌ల్లో ఉత్తీర్ణుతులైనవారు ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. NCVT/SCVT నుంచి ITI సర్టిఫికేట్ తప్పనిసరి. అక్టోబరు 10 నాటికి 15- 24 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, SC, STలకు ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక, ఫీజు ప్రక్రియ
అభ్యర్థులు మెరిట్(Merit) జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది మెట్రిక్యులేషన్ (కనీసం 50% మొత్తం), ITI పరీక్షల నుంచి మార్కుల సగటు శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి సమాన వెయిటేజీ ఇవ్వబడుతుంది. తుది ఎంపికకు ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అవసరం. OC, OBC, EWS అభ్యర్థులు రూ.100 ఫీజు కట్టాల్సి ఉంటుంది. మహిళా, దివ్యాంగులు, SC, ST అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
డివిజన్/ వర్క్‌షాప్‌లు:
BCT డివిజన్, BRC డివిజన్, ADI డివిజన్, RTM డివిజన్, RJT డివిజన్, BVP డివిజన్, PL వర్క్‌షాప్, MX వర్క్‌షాప్, BVP వర్క్‌షాప్, DHD వర్క్‌షాప్,PRTS వర్క్‌షాప్, SBI ఇంజినీరింగ్ వర్క్‌షాప్, SBI సిగ్నల్ వర్క్‌షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్ వంటి డివిజన్లలోని అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
– ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2024 సెప్టెంబర్23
– ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 అక్టోబర్ 22
వెబ్‌సైట్: https://rrc-wr.com/