మూడు రంగులు జెండాది అధికారం..రాహులే ప్రధాని ..మంత్రి తుమ్మల

మన Enadu: రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశంలో మూడు రంగుల జెండాదే అధికారం రాబోతుందని వ్వవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాహులే ప్రధానిగా దేశాభివృద్ధిలో కీలకమైన అడుగులు వేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్​లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన బీఆర్​ఎస్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్​, భారతీయ జనతాపార్టీల మధ్యనే పోటీ ఉండబోతుందన్నారు. తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాల్లో మొత్తం కాంగ్రెస్​ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు. ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్​ఎస్​ దుకాణం బంద్​ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శలు  చేశారు. గత సర్కారు బీఆర్​ఎస్​ చేసిన మోసాలను సోషల్​ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

మూడు నెలల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు నాలుగు గ్యారంటీలు అమలు చేసి ప్రజాప్రభుత్వంగా తిరుగులేని విజయాన్ని రేవంత్​ సర్కారు సొంతం చేసుకకుందని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవయ్యేలా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్​ ఇంచార్జీ మందముల పరమేశ్వరరెడ్డి, జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్​ పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్