ManaEnadu:కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ (సెప్టెంబరు 16వ తేదీ) ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం (16th Finance Committee Meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్థిక సంఘానికి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’గా పిలుచుకుంటున్నామని, బలమైన పునాదులున్నా.. రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు.
తెలంగాణ భారీ రుణభారం (Telangana Debts) రూ.6.85లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారని చెప్పారు. ఆదాయంలో అధికంగా రుణాల చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాల్సి ఉందని.. నిర్వహణ సరిగా లేకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రుణ సమస్య పరిష్కారానికి తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని రేవంత్ రెడ్డి కోరారు. రుణాల్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీస్ట్రక్చర్ చేయకపోతే అదనపు ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. కేంద్ర సహకారం ఉంటే తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశాన్ని (India) మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని 16వ ఆర్థిక సంఘం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
16వ ఆర్థిక సంఘం భేటీలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Tweet) ఓ ట్వీట్ చేశారు. “ప్రజా భవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొనడం జరిగింది. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర. భారీ రుణభారం తెలంగాణకు సవాల్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ అప్పు రూ.6.85 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాల తిరిగి చెల్లింపులకే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్రానికి కేంద్ర మద్ధతు అవసరం ఉంది. రుణాల రీ స్ట్రక్చర్ కు అవకాశం ఇవ్వాలి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 41 శాతం నుండి 50 శాతానికి పెంచాలి. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం నుండి సహకారం కోరుతున్నాం. ఆర్థిక సంఘం సిఫార్సులు ఆ దిశగా ఉండాలని కోరుకుంటున్నాం.” అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
The 16th Finance Commission meeting commenced at Praja Bhavan, chaired by its respective members Hon'ble CM Revanth Reddy and led by Deputy CM Bhatti Vikramarka and the Ministers Sridhar Babu, Uttam Kumar Reddy, Komati Reddy Venkat Reddy, Ponnam Prabhakar, and Ponguleti Srinivas… pic.twitter.com/Z4nsR6bkkn
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) September 10, 2024
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…