Medical Colleges: తెలంగాణకు గుడ్‌న్యూస్.. మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

ManaEnadu: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్(National Medical Commission) అనుమతి ఇచ్చింది. మెదక్, యాదాద్రి , మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు NMC అనుమతి లభించింది. ఒక్కో కాలేజీకి 50 సీట్లు (Seats) కేటాయించింది. దీంతో మొత్తం 200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీల(Medical Colleges)కు కేంద్రం అనుమతి ఇచ్చినట్లైంది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ(Central Health Ministry) తాజాగా లేఖ పంపించింది. ఒక్కో కాలేజీలో‌ 50 MBBS సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది.

 అప్పుడు సరైన సౌకర్యాలు లేవని తిరస్కరణ

కాగా ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన NMC అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్(Teaching Staff), సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు‌. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో, అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. NMC లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఆ తర్వాత ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్‌ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ (Health Minister Damodara Rajanaraimha) రెగ్యులర్‌గా మానిటర్ చేసి ఈ కాలేజీలకు స్టాఫ్‌(Staff)ను నియమించారు.

 సీఎం రేవంత్ చొరవతో..

మరోవైపు CM రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ(Medical Health Secretary Christina), మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు, డాక్టర్ల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, NMC అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో‌ అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.

Share post:

లేటెస్ట్