Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో విచారణ వాయిదా

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. మరోసారి ఆమె బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఉన్నత ధర్మాసనం తీర్పును ఆగస్టు 27కి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమెకు బెయిల్ ఇవ్వొందంటూ సీబీఐ, ఈడీ ధర్మాసనాన్ని కోరాయి. దానికితోడు కౌంటర్ కూడా దాఖలు చేశాయి. అయితే హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మార్చి 15న అరెస్టుకాగా.. సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవితను అరెస్టు చేశారు. ఇప్పటికే 5 నెలలకు పైగా ఆమె తిహార్ జైళ్లోనే ఉంటున్నారు. అయితే ఆమెకు ఈసారైనా బెయిల్ లభిస్తుందని ఆశించిన కవిత కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ శ్రేణులకు మరోసారి నిరాశే మిగిలింది. అయితే ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు పదే పదే నిరాశే ఎదురవుతోంది.

తాజాగా క‌విత త‌ర‌పు న్యాయ‌వాది మోహిత్ రావు వాద‌న‌లు వినిపించారు. సెక్షన్ 50 పీఎంఎల్ఏలో భాగంగా సాక్షులను ఒత్తిడి చేసి త‌ప్పుడు వాంగ్మూలాల‌ను న‌మోదు చేశార‌ని మోహిత్ రావ్ కోర్టుకు మ‌రోసారి స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో కవితదే కీలక పాత్ర అని.. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసి.. ఆధారాలను తారమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని గత విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Share post:

లేటెస్ట్