ManaEnadu:ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలోపం. ప్రశాంతమైన నిద్రకు చాలా మంది దూరమవుతున్నారు. నేటి యువతను మీ కల ఏంటి అని అడిగితే.. ఎలాంటి ఆలోచన లేకుండా కనీసం నాలుగైదు గంటలు నిద్రపోవడం అని చెబుతున్నారు. అయితే మారిన జీవనశైలి, ఒత్తిడి ఇతర కారణాల వల్ల రాత్రిపూట నిద్రకు చాలా మంది దూరమైపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
సాధారణంగా నిద్రలేమి జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం, రాత్రిపూట మొబైల్, కంప్యూటర్ ఎక్కువగా చూడటం వంటివి ప్రధాన కారణాలు. అయితే ఇవే కాకుండా.. మీ నిద్రను దీర్ఘకాలికంగా దూరం చేయడంలో మీరు రోజూ తీసుకునే కొన్ని ఆహారపదార్థాలు కూడా కారణమవుతాయట. అలాగే కొన్ని ఆహార పదార్థాలు మీక నాణ్యమైన నిద్రను అందిస్తాయట. అలా మనం తినే తిండిపైన మంచి నిద్ర ఆధారపడి ఉందట. మరి నాణ్యమైన నిద్ర దరి చేరాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..? ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందామా..?
నాణ్యమైన నిద్ర కోసం తీసుకోవాల్సి ఆహారం
ఆకుకూరలు
ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు
కివీ పండ్లు
ఐరన్, విటమిన్ ఉండే ఆహారం
మాంసం
డెయిరీ పదార్థాలు
చెర్రీలు
బెర్రీ పండ్లు
ఆలివ్ నూనె
చేపలు
ఏవి తినకూడదంటే..
ప్రాసెస్ చేసిన ఆహారం
బర్గర్లు
వేపుళ్లు
పాస్తా
వైట్ బ్రెడ్
ఆల్కహాల్
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్
కెఫిన్
రసాయనాలతో పండించిన ఆహారం
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ 18 ఏళ్లు నిండిన వారిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో తాజా పండ్లు, కూరగాయాలు తక్కువ మోతాదులో తిన్న వారు.. తక్కువ సమయం నిద్రపోయారని.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తిన్నవారంతా హాయిగా నిద్రపోయారని తేలినట్లు నూట్రిషినల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎరికా జన్సేన్ వెల్లడించారు. ఇంకా..
రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడమే కాకుండా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
గమనిక : ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం, శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య నిపుణుల సూచనల ప్రకారం అందిస్తున్నవి మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.