కమిటీ కుర్రోళ్లు..పిఠాపురం అసెంబ్లీ తాలుకా.

Mana Enadu:పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని..గుగుల్​నే కాదు..రాజకీయాలను షేక్​ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో టాలివుడ్​ పిఠాపురం వైపు దృష్టి సారించారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్‌ను అక్క‌డ నిర్వ‌హిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్లి హంగామా చేశారు. బాబాయ్ పవ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గానికి మెగా డాట‌ర్ వెళ్ల‌టం హాట్ టాపిక్‌గా మారింది.

https://x.com/PinkElephant_P/status/1820064159247315034

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగ‌స్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోషన్స్‌లో వేగం పెంచారు. అందులో భాగంగా పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ నుంచి వైజాగ్ ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డ సందడి చేసింది. అందులో భాగంగా పిఠాపురంకు చిత్ర యూనిట్ వెళ్లింది. అక్క‌డ‌ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించింది.

ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మంచి డైలాగ్స్‌తో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా రూపొందింది. మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్‌, సాంగ్స్ చూస్తుంటే మ‌న స‌మాజంలో జ‌రిగే నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా, మ‌నం మ‌న స్నేహితుల‌తో ఎలా ఉంటామో అలాంటి స‌న్నివేశాల‌ను పొందుప‌రుస్తూ సినిమాను రూపొందించార‌ని స్పష్ట‌మ‌వుతుంది. స్నేహం గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జెప్పేలా ఉండే ఈ సినిమాను చూడాల‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఏర్ప‌డింది. దీంతో ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. సోమ‌వారం హైద‌రాబాద్‌లో క‌మిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.

 

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *