ఈ వారం థియేటర్లలో చిన్న చిత్రాల సందడి.. ఓటీటీలో మాత్రం సూపర్ ఫన్

Mana Enadu:ఆగస్టు నెల వచ్చేసింది. ఈ వారం అడపాదడపా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక రెండో వారంలోనూ థియేటర్‌లో చిన్న చిత్రాల హవానే సాగనుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లు అలరించేందుకు మీ ముందుకు రాబోతున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.. ? ఎలాంటి వెబ్ సిరీస్లు, చిత్రాలు ఓటీటీలో మిమ్మల్ని అలరించేందుకు రెడీగా ఉన్నాయో ఓసారి చూద్దామా..?

థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..

 

తమిళ నటుడు విజయ్ ఆంటోని కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం తుఫాన్. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

సందీప్‌ సరోజ్, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’ . ఈ సినిమాఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించిన సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సింబా’. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భవనమ్‌’- ది హంటెడ్‌ హౌస్‌. ఆగస్టు 9న రిలీజ్ కానుంది. 

 

వీటితో పాటు, మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘మురారి’ సినిమా రీరిలీజ్‌ కానుంది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ నటించిన ‘సూపర్‌ డీలక్స్‌’ కూడా రీ రిలీజ్ కాబోతోంది. 

 

ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!

 

నెట్‌ఫ్లిక్స్‌

 

కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9

 

ది అంబ్రెలా అకాడమీ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 8

 

భారతీయుడు2 (తెలుగు/తమిళ్‌) ఆగస్టు 9

 

ఫిర్‌ ఆయే హసీనా దిల్‌ రుబా (హిందీ) ఆగస్టు 9

 

మిషన్‌ క్రాస్‌ (కొరియన్‌) ఆగస్టు 9

 

ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9

 

రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌ (కొరియన్‌) ఆగస్టు 10

 

సోనీలివ్‌

 

టర్బో (మలయాళం/తెలుగు) ఆగస్టు 9

 

జీ5

 

భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌ (హిందీ) ఆగస్టు 5

 

అమర్‌ సంగి (బెంగాలీ) ఆగస్టు 5

 

గ్యాహరాహ్‌ గ్యాహరాహ్‌ (హిందీ) ఆగస్టు 9

 

డిస్నీ+హాట్‌స్టార్‌

 

ది జోన్‌: సర్వైవల్‌ మిషన్‌ (కొరియన్‌) ఆగస్టు 7

 

ఏఏఏ (హిందీ) ఆగస్టు 8

 

ఆర్‌ యూ ష్యూర్‌ (కొరియన్‌) ఆగస్టు 8

 

లైఫ్ హిల్‌ గయీ (హిందీ) ఆగస్టు 9

 

 

 

 

Share post:

లేటెస్ట్