Mana Enadu: తన ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. RX100 సినిమాతో యూత్ మతి పోగొట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత డిస్కో రాజా, వెంకీ మామ వంటి చిత్రాలలోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఆపై వరుసగా బడా అవకాశాలు దక్కించుకున్న పాయల్ ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే తనకు తొలి హిట్‌ను ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన మంగళవారం మూవీతో మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
సినిమాలే కాదు..
ఇక కేవలం మూవీల్లోనే కాక సోషల్ మీడియా (Social meadia)లోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఈ అమ్మడు.. తన గ్లామరెస్ ఫొటోలతో యూత్ హార్ట్ బ్రేక్ చేస్తోంది. తాజాగా ఫిలిం ఫేర్(Film Fare) అవార్డుల వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా పాయల్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏంటి.? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ బ్యూటీ బదులిచ్చింది. ప్రభాస్(Prabhas)తో నా పెళ్లి అయ్యిందటూ గతంలో రూమర్స్(Rumours) హల్‌చల్ చేశాయి. వాటిని చూసి బాగా నవ్వుకున్నాని, అది నిజమైతే బాగుండని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది పాయల్. తన జీవితాన్ని వేరే నటి లేదా నటుడి లైఫ్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారన్న మరో ప్రశ్నకు.. తనకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని. ప్రజెంట్ తాను ఎంతో సంతోషంగా ఉన్నాని తెలిపింది. చుట్టూ ఉన్న వాళ్లంతా తనపై చూపించే ప్రేమాభిమానాల వల్ల జీవితం మరింత అందంగా మారిందని చెప్పుకొచ్చింది.

మోడల్‌గా లైఫ్ స్టార్ట్ చేసి..
డిసెంబర్ 5, 1990న గూర్గాన్‌లో జన్మించింది పాయల్. మొదట ఓ చలనచిత్ర నటికి మోడల్‌గా చేసింది. తరవాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలుత పంజాబీ చిత్రాలతో తెరంగేట్రం చేసింది. ఆ తరవాత తెలుగు తమిళ భాషలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. తెలుగులో పాయల్ నటించిన తొలి చిత్రం RX100 టాలీవుడ్‌లో ఫ్యాన్స్‌లో ఓ రేంజ్ క్రేజ్‌ను సంపాధించి పెట్టింది.






