Devara 2nd Song: అనిరుధ్ భయ్యా.. సాంగ్ సూపర్

Mana Enadu:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr) హీరోగా, కొరటాల శివ(korata shiva) డైరెక్షన్‌లో వస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ దేవర(Devara). ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటీ జాన్వీ(janvi) కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. అప్పుడెప్పుడో ఒక గింప్స్‌(glimps)తో పాటు ఓ సాంగ్(song) రిలీజ్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు. తమ అభిమాన హీరో మూవీ నుంచి కొత్త అప్డేట్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

గ్లామర్‌తో ఊపేసిన జాన్వీ..

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ దేవర నుంచి ‘చుట్టమల్లె’ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఈ సాంగ్ సాగింది. ముఖ్యంగా తన గ్లామర్‌తో జాన్వీ ఆకట్టుకుంది. సాంగ్ మ్యూజిక్, లిరిక్స్, లోకేషన్స్, విజువల్స్ అన్నీ అదిరిపోయాయి. అందరినీ ఆకట్టుకునేలా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(anirudh) తమ స్ట్రెంత్ ఏంటో మరోసారి చూపించారని ఫ్యాన్స్ అంటున్నారు. రోజు రోజుకీ అభిమానుల్లో హైప్ పెంచుతున్న దేవర.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తోంది చూడాలి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.

 

 

Share post:

లేటెస్ట్