Devara : ‘చుట్టమల్లె’లో ఎన్టీఆర్, జాన్వీ రొమాన్స్.. ఏం కెమిస్ట్రీరా బాబు మైండ్ లో నుంచి పోవట్లే!

Mana Enadu:టాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్ ఎన్టీఆర్-శ్రీదేవి. ఇప్పుడు ఈ పెయిర్ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు ఎన్టీఆర్ మనవడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ వచ్చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు పాత్రలకు సంబంధించి లుక్స్ రిలీజ్ అయ్యాయి. 

సెప్టెంబర్ 27వ తేదీని రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక్కొక్క అప్డేట్ వదులుతూ వస్తున్నారు. ఇప్పటికే దేవర ఫియర్ సాంగ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. చుట్టమల్లే సుట్టేస్తాందే తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు అంటూ రొమాంటిక్ మెలోడి సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల మధ్య రొమాన్స్ అదిరిపోయింది. జాన్వీ కపూర్ అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరిలో శ్రీదేవిని తలపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ పాటను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ రాయగా.. ఈ పాటను శిల్పా రావ్‌ పాడారు. అనిరుద్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందించారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ను ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Share post:

లేటెస్ట్