Mana Enadu:తమిళ నటి త్రిష (trisha) గురించి తెలుగు వారికి స్పెషల్‌గా పరిచయం అక్కర లేదు.. ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ తమిళ పొన్ను. ఆ తర్వాత వరుసగా తెలుగులో నటిస్తూ.. కొన్నాళ్లపాటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానూ నిలిచింది. ఇక 40 ఏళ్ల ఏజ్‌లో కూడా అందంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ వావ్ అనిపిస్తోంది. అయితే ఇటీవల మణిరత్నం డైరెక్షన్‌లో పొన్నియన్ సెల్వన్ సిక్వెన్స్ మూవీలతో త్రిష మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమాల తర్వాత ఈమెకు తమిళ సినీ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ భామ హీరో విజయ్ నటించిన లియోలోనూ కీలకపాత్రలో మెరిసింది.
వర్షం కోసం బిగ్ రిస్క్..
అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన వర్షం సినిమా చరిత్ర తిరగరాసింది . ఈ సినిమా కోసం త్రిష ఏకంగా 20 రోజులపాటు వర్షం (Varsham)లో నిరంతరంగా తడిచిందట. ఆ టైంలో ఆమెకు ఆరోగ్యం బాగో లేకపోయినా సరే సినిమా హిట్ అవ్వడానికి బిగ్ రిస్కే(risk) చేసిందట. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది . ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రభాస్ నటన ఎంత కారణమో .. త్రిష డెడికేషన్ కూడా అంతే కారణం అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేశారు కూడా. ఈ సినిమాకు శోభన్(shobhan) దర్శకత్వం వహించగా.. గోపీచంద్(gopi chand) విలన్‌గా నటించారు. ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లోనూ ప్రభాస్, త్రిష కలిసి నటించారు.
దాదాపు 16 ఏళ్ల తర్వాత
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) మరోసారి త్రిషతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ (spirit) సినిమాలో హీరోయిన్‌గా త్రిషను తీసుకోనున్నట్లు టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే దాదాపు 16 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే స్క్రీన్‌లో అభిమానులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్ రెండు పాత్రల్లోనూ ప్రభాసే ఉంటారనే మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. అలాగే ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, యాక్షన్, ఫన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీపై త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రభాస్, త్రిష కాంబో మరోసారి ప్రేక్షకులను కనువిందో చేస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే..