Mana Enadu:ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా (1980’s Radhekrishna)రాదే కృష్ణ. ఈ సినిమాని తెలుగు మరియు బంజారా భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు, నిర్మాత రామ్ తల్లూరి గారు, హీరో సోహెల్ మరియు ఆటో రాంప్రసాద్ విచ్చేశారు.
విప్లవ వర్గాల నడుమ నెత్తురు మరకలతో లిఖించిన ప్రేమ కథతో రాదే కృష్ణ సినిమా రూపొందించారు. టీజర్‌లో తనికెళ్ల భరణి వాయిస్‌తో ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా తీశారని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు.
ఈ సినిమా టీం నాకు ఫ్యామిలీ వంటిందని సైదుల్ని నిర్మాతని టీం ని సపోర్ట్ చేయడానికి వచ్చానని హీరో సోహెల్ అన్నారు.సినిమా హిట్, ప్లాప్ వంటి అంశాల జోలికి పోకుండా ప్రేక్షకులకు వినోదం పంచుతూనే ఉంటామని భావోద్వేగం అయ్యారు.

కథా రచయిత రాజేష్ మాచర్ల మాట్లాడుతూ : ఈ ఈవెంట్ కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ గారికి, హీరో సోహెల్ గారికి, రామ్ తల్లూరి గారికి, ఆటో రాంప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత ఊడుగు సుధాకర్ మాట్లాడుతూ : ఎంతో బిజీగా ఉండి కూడా సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్, హీరో సోహెల్, రామ్ తల్లూరి, ఆటో రాంప్రసాద్ కృతజ్ఞతలు. టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన తనికెళ్ల భరణి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
హీరో ఎస్ ఎస్ సైదులు మాట్లాడుతూ : ఈ సినిమా కోసం కష్టపడిన మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచి సర్ప్రైజ్ ఉంది. కచ్చితంగా అందరికీ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
హీరోయిన్ భ్రమరాంబికా మాట్లాడుతూ :ఆయన వాయిస్ ఓవర్ వల్లే చాలామందికి మా టీజర్ రీచ్ అవుతోంది. 1980లో రాదే కృష్ణ అప్పటి సిచువేషన్స్ కి తగినట్టు ఈ సినిమాని తీశారు డైరెక్టర్ ఇస్మాయిల్ .
దర్శకుడు ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ : సినిమా పూర్తయింది టీజర్ ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు తనికెళ్ల భరణి వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది.టీజర్ కి ఒక కొత్త ఫీల్ వచ్చింది.






