నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లెప్పుడు – నాగార్జున ఏం చెప్పారంటే?

Mana Enadu:ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ గురించే చర్చ. గురువారం రోజున హైదరాబాద్ లో ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీళ్ల నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఎవరీ శోభిత అంటూ నెటిజన్లు ఆమె గురించి వెతకడం షురూ చేశారు. అయితే ఎంగేజ్మెంట్ అయింది.. మరి పెళ్లి ఎప్పుడంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

తాజాగా నాగచైతన్య తండ్రి, అక్కినేని నాగార్జున ఓ వెబ్ సైట్ తో మాట్లాడుతూ తన కొడుకు పెళ్లి గురించి స్పందించారు. వాళ్లిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారో కూడా చెప్పేశారు. అయితే సమంతతో విడాకుల తర్వాత చైతో పాటు వాళ్ల ఫ్యామిలీ కుడా చాలా బాధపడ్డామని నాగ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చై ఎవరితోనూ ఆ బాధను షేర్ చేసుకోలేదని.. ఇప్పుడు తనకు నచ్చిన అమ్మాయితో ఇలా సంతోషంగా ఉండటం చూస్తుంటే తమ కుటుంబంలో మళ్లీ సంతోషం వచ్చినట్లు అనిపిస్తోందని తెలిపారు. అయితే పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని వాళ్లు చెప్పారని వెల్లడించారు.

ఇక ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.  ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 (08-08-2024) అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. ఇక ఈ పోస్టు కింద పలువురు నెటిజన్లు స్పందిస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు., 

 

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *