Sangharshana “సంఘర్షణ” రిలీజ్, ట్రైలర్ విడుదల

Mana Enadu:మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ సంఘర్షణ. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న థియేటర్స్ లో విడుదల కానుంది.

చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక క్యురియాసిటీని కలిగించే విధంగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుధాకర్ బార్ట్లే అండ్ కేవీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వన్ మీడియా ద్వారా పార్థు రెడ్డి సంఘర్షణ సినిమాను థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఆదిత్య శ్రీ రామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాతో రావడం సంతోషంగా ఉందని నిర్మాత వల్లూరి.శ్రీనివాస్ రావ్ తెలిపారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *