‘బిగ్‌బాస్‌’కు స్టార్‌ హీరో బ్రేక్.. మరి నెక్స్ట్ హోస్ట్ ఎవరు?

Mana Enadu:’బిగ్ బాస్’..  ఈ రియాల్టీ షో భారతదేశంలో పలు భాషల్లో తెరకెక్కుతోంది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా హిందీలో అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో సీజన్లు, కొత్తగా ఓటీటీ వెర్షన్ లో కూడా వచ్చేసింది. ఈ షోకు అసలు సిసలైన అందం అంటే ఈ షోను హోస్టు చేసే వ్యాఖ్యాతలే. ఈ కార్యక్రమం వస్తున్న ప్రతి భాషలో ఈ షోకు స్టార్ హీరోలే హోస్టింగ్ చేస్తున్నారు. కొన్ని భాషల్లో అయితే.. హోస్టు వల్లే షోకు టీఆర్పీ ఎక్కువగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా సూపర్ హిట్ గా దూసుకెళ్తున్న ఈ షో హోస్టింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడట ఓ స్టార్ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరు.. అది ఏ భాషలో వస్తున్న బిగ్ బాస్ షో..

 కమల్‌ హాసన్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న  తమిళ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. తమిళంలో ఈ షో మొదలైనప్పటి నుంచి ఆయనే హోస్టుగా ఉన్నారు. ఇన్నేళ్లు ఈ షోను విజయవంతంగా నడిపించిన ఆయన  తాజాగా ‘బిగ్‌బాస్‌’కు బ్రేక్  ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా తెగ ఫీల్ అవుతున్నారు. తాము చూసేదే కమల్ కోసం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీ వాంట్ కమల్ సార్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

‘ఏడేళ్ల కిందట మొదలైన నా బిగ్‌బాస్‌ తమిళ్‌ ప్రయాణానికి చిన్న బ్రేక్ ఇస్తున్నా. ప్రస్తుతం నా చేతిలో ఉన్న సినిమాల షూటింగులతో చాలా బిజీగా ఉన్నాను. ‘బిగ్‌బాస్‌’షో ద్వారా మీ అందరి ఇళ్లకు రావడం చాలా సంతోషంగా ఉంది.  నాతో పాటు, ఈ షోపై మీరు చూపిన ప్రేమ, అభిమానానికి థాంక్యూ. హోస్టుగా నన్ను నేను మరో కొత్త కోణంలో చూడటమే కాదు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.  ఇందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అద్భుతమైన విజయ్‌ టీవీ టీమ్‌కు కృతజ్ఞతలు. రాబోయే సీజన్‌ మరింత విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని కమల్ హాసన్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 

ఇక ‘బిగ్‌బాస్‌’ తమిళ్‌కు కమల్‌హాసన్‌ బ్రేక్ ఇవ్వడంతో తర్వాత హోస్టుగా ఎవరస్తారనే దానిపై చర్చ మొదలైంది. అయితే చాలా మంది నటుడు శింబు వస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక త్వరలోనే తమిళ్ బిగ్ బాస్ 8వ సీజన్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హోస్టును కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

Share post:

లేటెస్ట్