త్వరలోనే పట్టాలెక్కనున్న వందేభారత్​ ‘స్లీపర్​ ట్రైన్​’.. టికెట్ ధర ఎంతంటే?

Mana Enadu:వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు (Vande Bharat Sleeper Train) త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. పది రోజుల పాటు ట్రయల్స్, టెస్టుల తర్వాత మరికొన్ని పరీక్షలు జరిపి ఆ తర్వాత వీటిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఎమ్‌ఈఎల్‌) ఫెసిలిటీలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ప్రొటోటైప్‌ వెర్షన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Railway Minister Ahwini Vaishnav) ఆవిష్కరించారు. వందే భారత్‌ చైర్‌ కార్‌ విజయవంతమైన తర్వాత, వందే భారత్‌ స్లీపర్‌ తయారీ ఇప్పుడే పూర్తయిందని ఆయన తెలిపారు. 

ఏడాదిన్నర తర్వాత నెలకు రెండు నుంచి మూడు చొప్పున వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు  పట్టాలెక్కనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వందే భారత్‌ రైళ్లు మూడు వెర్షన్లలో రానున్నాయని తెలిపారు. వీటి టికెట్‌ ధర (Vande Bharat Sleeper Train Ticket Price) రాజధాని ఎక్స్‌ప్రెస్‌ () ధరకు సమానంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సేవలు అందిస్తుండగా.. త్వరలో వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. 800 నుంచి 1200 కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణిస్తాయని వివరించారు.

వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో ఉండే సదుపాయాలు ఇవే..

వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ల్లో రీడింగ్‌ ల్యాంప్స్‌, ఛార్జింగ్‌ అవుట్‌లెట్‌లు (Charging Points), స్నాక్‌ టేబుల్, మొబైల్‌-మ్యాగజైన్‌ పెట్టుకునే సదుపాయాలు ఉంటాయి.
రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్‌’ వ్యవస్థ
అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కార్‌ బాడీతో ఉంటాయి.
జీఎఫ్ఆర్​పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.
అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
ఆటోమేటిక్‌ డోర్లు, మెరుగైన సదుపాయాలతో టాయిలెట్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు ఇందులో అమర్చారు.
16 కోచ్‌లు, 823 బెర్త్‌ల (Vande Bharat Sleeper Trains Berths)తో వందే భారత్‌ స్లీపర్‌ రైలు రానుంది.
11, 3టైర్‌ ఏసీ కోచ్‌లు, 4, 2 టైర్‌ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్‌ టైర్‌ ఏసీ కోచ్‌ ఉంటుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *