మన ఈనాడు: ఉప్పల్ కాంగ్రెస్ అసెంబ్లీ టిక్కెట్ మండముల పరమేశ్వర రెడ్డికే దాదాపు ఖరారు పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారం.ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఇప్పుడు తన సతీమణి రజిత సైతం ఉప్పల్ కార్పొరేటర్ గా ఉన్నారు. బల్దియా ఎన్నికల్లో ఉప్పల్ నియోజవర్గం నుంచి రెండు డివిజన్లు గెలిచాయి.
ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ గా గెలిచిన సింగిరెడ్డి శిరీషారెడ్డి విజయం సాధించారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి B బ్లాక్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఉప్పల్ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలో టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. చివరకు పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. BRS అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసమే తనకు కాకుండా మరో వ్యక్తి టిక్కెట్ ఇస్తున్నారని తన పదవలకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం
.