మన ఈనాడు: కాంగ్రెస్‌పార్టీ కన్నతల్లి లాంటింది..మా అనుచరులు, కుటుంబసభ్యులతో చర్చించి భవిష్యత్ కార్యచరణలు ప్రకటిస్తానని సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి టీంగా ఉంటూ పార్ట అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశాం. రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే ఉప్పల్ టిక్కెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపించాడని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడిపై సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి దంపతులు ఘాటుగా విమర్శలు చేశారు.
రేవంత్ కు హటావో..కాంగ్రెస్ కు బచావో
తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతానని..రేవంత్‌రెడ్డి సంగతి చూస్తానని, రేపటి నుంచి రేవంత్‌రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొస్తానని సంచనలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఉన్నంతకాలం కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాదన్నారు. రేవంత్‌రెడ్డి కు హటావో..కాంగ్రెస్ కు బచావో పేరుతోనే కాంగ్రెస్ బతుకుతుందని అన్నారు.
కరోనా సమయంలో ప్రజల కోసం రూ.5కోట్లకు పైగా ఖర్చు ప్రజల్లో ఉన్నానని పేర్కొన్నారు.తన రాజీనామాతోనైనా కాంగ్రెస్‌పార్టీ పెద్దలు ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉప్పల్ కాంగ్రెస్ గెలిస్తే..నా ఆస్తులు రాసిస్తా
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే తన ఆస్తులు మొత్తం రాసిస్తానని సంచలనమైన సవాల్ చేశారు. తనకు సర్వేలలో అనుకూలంగా ఉన్నప్పటికీ రేవంత్‌రెడ్డి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. స్క్రీనింగ్ కమిటీలో తన పేరు లేకుండా చేసిన పార్టీలో తానేందుకు ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులు చూస్తుంటే..పైసలకే టిక్కెట్లు అమ్ముకున్నట్లుగా బహిరంగంగానే ప్రజలకు తెలుస్తుందన్నారు.