సూపర్​ TSRTC 100రోజుల ఫెస్టివల్​ ఛాలెంజ్

మన ఈనాడు: ప్రస్తుతం రానున్న పండుగల సమయాల్లో ఆర్టీసీ వ్యూహం మార్చింది. బస్సులను అదనపు కిలోమీటర్లు నడపనుంది. సెలవులు, ఆఫ్‌లు తీసుకోకుండా పనిచేసే సిబ్బందిని గుర్తించి క్యాష్ రివార్డులు అందజేస్తామని ప్రకటించింది. దీంతో ప్రతిరోజూ అదనంగా రూ1.64 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని రాబడుతోంది.100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌తో రూ.164కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని ఆర్టీసీ సంస్థ ప్రణాళికలు చేసింది.

బతుకుమ్మ, దసరాతో పాటు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగల నేపథ్యంలో ఆర్టీసీ లాభాల బాటలో వెళ్లేలా అడుగులు వేస్తుంది. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. జనవరి 22 వరకు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌కు వినూత్నంగా శ్రీకారం చుట్టింది. ఈ విషయంపై ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ ఈ సవాలును స్వీకరించాలంటూ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు లేఖ రాశారు.

వరుస పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోనున్నాయి. ఈ పండుగల సమయాల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సు ట్రిప్పులను అందుబాటులోకి తీసుకరావలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.ఇప్పటినుంచి ప్రతిరోజూ మరో లక్ష కిలోమీటర్లు అదనంగా నడపాలని ఆర్టీసీ భావిస్తుంది. బతుకుమ్మ, దసరాతో పాటు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు.. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి జనవరి 22వ తేదీ వరకు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ విషయంపై ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ ఈ సవాలును స్వీకరించాలంటూ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు లేఖ రాశారు.

Related Posts

Sankranti Special: నేటి నుంచి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణం(Telangana) మణిహారమైన మన భాగ్యనగరం(Hyderabad) మరో అంత‌ర్జాతీయ వేడుక‌కు సిద్ధమైంది. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13, 14, 15వ తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌(Secunderabad Parade Grounds)లో నిర్వహించే 7వ అంత‌ర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివ‌ల్ కోసం ప‌ర్యాట‌క,…

Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

తెలంగాణ(Telangana) రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy)కి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా రాత్రి 8:45 గంటల సమయంలో ఖమ్మం(Khammam) జిల్లా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *