మన ఈనాడు:తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన రాజకీయ పార్టీలకే మా ఓట్లు అని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిరుద్యోగులు, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అయా పార్టీల మ్యానిఫెస్టోలలో పొందుపరచాలని AIYF రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
భారతదేశ రాజకీయాలు క్రమంగా అవకాశవాద, అవినీతి క్రీడగా మారిపోతున్నాయని, భారతదేశ సైద్ధాంతికత స్థానంలో కులం, మతం వచ్చి చేరడం చాలా బాధాకరమని అన్నారు. 76 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా దేశంలో నాలుగో వంతు జనాభా దారిద్య్రరేఖకు దిగువనే జీవిస్తున్నారని, కనీస రక్షిత తాగునీరు లభించడం లేదని, పారిశుద్ధ్యం మరింత అధ్వాన్నమని,కనీస ఆరోగ్య సదుపాయాలు లేవన్నారు. ఎన్నికల వ్యవస్థ అవినీతి, బంధుప్రీతితో కూరుకుపోయిందని వారు విమర్శించారు.
ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం పెరిగిపోయిందని అన్నారు.భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఎఐవైఎఫ్ క్రియాశీలకంగా పనిచేసిందన్నారు. అదే స్ఫూర్తితో అవినీతి రహిత రాజకీయ వ్యవస్థ కోసం, అన్ని రకాల దోపిడీలకు వ్యతిరేకంగా యువజన సమాఖ్య పోరు కొనసాగిస్తున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు యువతకు, విద్యార్థులకు, మహిళలకు,దళితులకు, ఆదీవాసీలకు, మైనారిటీ లకు పూర్తి స్థాయి అవకాశాలు కల్పించేలా రాజకీయ ముసాయిదాల్లో పై డిమాండ్లను పొందుపరచాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో AIYF రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నెర్లకంటి శ్రీకాంత్, కనుకుంట్ల శంకర్, యుగంధర్, నానబాల రామకృష్ణ… కార్యవర్గ సభ్యులు షేక్ మహమూద్, మాజీద్, ఉపేందర్, శ్రీనాధ్, సత్య ప్రసాద్ పాల్గొన్నారు