Mana Enadu : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది. ఇక ఇప్పుడు విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. దళపతి 69 అంటూ వస్తున్న సినిమాను కార్తీ నటించిన ఖాకీ ఫేం హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే విజయ్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
రీమేక్ కింగ్ దళపతి విజయ్
రీమేక్ లలో నటించడం.. రీమేక్స్ తో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం విజయ్ కు కొట్టిన పిండి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లలో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలను విజయ్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు సూపర్ హిట్ కలెక్షన్లు కూడా సంపాదించాడు. కొన్ని రోజులుగా రీమేక్ లకు కాస్త దూరంగా ఉన్న విజయ్ తాజాగా మరోసారి రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడట. అది కూడా తెలుగు సినిమాను. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే..?
కోలీవుడ్ లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్
దళపతి విజయ్ టాలీవుడ్ స్టార్ హీరో నటించిన ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కోలీవుడ్ రైట్స్ ను కూడా కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. ఈ సినిమాను విజయ్ రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం.
బాలయ్య మూవీ రీమేక్ లో దళపతి విజయ్
ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుందట. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. తెలుగులో భగవంత్ కేసరిలో శ్రీలీల నటించిన పాత్రలో కోలీవుడ్ లో ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటించనున్నట్లు టాక్. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
#TheGoatTrailer https://t.co/ZKXNHHtT8v pic.twitter.com/sxQN0AxpWp
— Vijay (@actorvijay) August 17, 2024