Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), హీరో అక్కినేని నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని సంచలన కామెంట్స్ చేశారు.
కేటీఆర్ హీరోయిన్ల జీవితాలు నాశనం చేశారు
“గతంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగులతో అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. ఆయన డ్రగ్స్ తీసుకుంటారు. హీరోయిన్లకు కూడా ఆయన డ్రగ్స్ అలవాటు చేశారు. ఆయన ఇబ్బందుల వల్లే హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమాలు విడిచిపెట్టారు. కేటీఆర్ హీరోయిన్లతో రేవు పార్టీలు పెట్టారు. వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నారు. నాగ చైతన్య (Naga Chaitanya), సమంత విడాకులకు ఆయనే కారణం.” అని మంత్రి కొండా సురేఖ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
మమ్మల్ని వదిలేయండి ప్లీజ్
మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున (Nagarjuna) తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండని హితవు పలికారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని కోరారు. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా ఆమె చేసిన వ్యాఖ్యలు, తమ కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని స్పష్టం చేశారు. తక్షణమే మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరారు.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
అసలేం మాట్లాడుతున్నారు
మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ (Konda Surekha) సంబంధం లేని అంశాల్లోకి లాగితే తమకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌పై, తమపై దాడి చేయలేదా? ఎంత దారుణంగా మాట్లాడలేదా అని నిలదీశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఎలా అంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడే థర్డ్ రేట్ మాటలకు ఇద్దరు మంత్రులు వెళ్లి ఫినాయల్ వేసి కడగాలని చురకలు అంటించారు.
కొండ సురేఖకు అసలు మంత్రి వర్గంలో ఉండే అర్హత లేదు.
కాంగ్రెస్ పైన చేస్తున్న పోరాటానికి తట్టుకోలేకే కొండ సురేఖతో ఈ మాటలు మాట్లడిస్తున్నారు.
అసలు మాటల్లో చెప్పలేని భాష మాట్లాడారు కొండ సురేఖ.
– బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. pic.twitter.com/eEaXasg9GC
— Telangana First (@TelanganaFirst_) October 2, 2024