తొక్కే కదా అని పడేస్తున్నారా.. లాభాలు తెలిస్తే ఇక అలా చేయరు!

ManaEnadu : ‘వీరశంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’… అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెప్పినట్లు మీరు కూడా తొక్కే కదా అని ఆలుగడ్డ పొట్టు (Potato Peel)ను అంత ఈజీగా తీసిపారేయకండి. బంగాళదుంప తొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు కూడా తొక్కలోది అని లైట్ తీసుకోరులెండి. ఇంతకీ ఆలుగడ్డ తొక్కలు ఎలా ఉపయోగపడతాయి? వాటిని ఎలా వాడాలి? తెలుసుకుందాం రండి. 

2018లో Agricultural and Food Chemistry జర్నల్​లో బంగాళదుంప తొక్కపై ఓ స్టడీ ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం ఆలుగడ్డ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయట. “Phytochemicals and Antioxidant Activity of Potato Peel Extracts” అనే అంశంపై చేపట్టిన రీసెర్చ్ లో వారణాసిలోని Banaras Hindu University ప్రొఫెసర్ Dr. Rakesh Kumar Singh పాల్గొన్నారు. ఈ అధ్యయనంలో ఆయన బంగాళాదుంప తొక్క చేసే మేలు గురించి కనిపెట్టారు. 

కళ్ల కింద నల్లటి వలయాల(Dark Circles)ను తగ్గించడంలో బంగాళదుంప తొక్క సహాయ పడుతుందని, దీన్ని చర్మంపై రుద్దడం వల్ల ముఖంపై దురద, దద్దుర్ల నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలో కనుగొన్నారు. అంతే కాదండోయ్ నల్ల మచ్చలను తొలగించడంలోనూ ఈ తొక్క భలే సాయపడుతుందట.

బంగాళ దుంప తొక్కలను స్నాక్స్ (Potato Peel Snacks)​గా కూడా వండుకోవచ్చట. ఈ తొక్కలను కాల్చి వాటిపై మసాలా చల్లుకుని క్రిస్పీ చిప్స్​గా తింటే భలే టేస్టీతో పాటు అందులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు రక్తహీనతను నివారిస్తుందట.

ఆలు తొక్కలను కంపోస్ట్​ ఎరువుగా వినియోగించవచ్చట. ఇందులో నత్రజని, పొటాషియం వంటి పోషకాలు మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయట. బంగాళదుంప తొక్కలతో చాలా వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు కూడా. వెండి (Silver), తుప్పు పట్టిన పాత్రలను ఈ తొక్కలతో రుద్ది కడిగితే మిలమిలా మెరుస్తాయి. ఆలుగడ్డ తొక్కలను బూట్లు పాలిష్ చేయడానికీ ఉపయోగించొచ్చు.

Share post:

లేటెస్ట్