మీ కిచెన్​లో ఈ టూల్స్ ఉంటే.. మస్త్ టైమ్ ఆదా?

Mana Enadu : సాధారణంగా ఎక్కువ శాతం మహిళలు తమ సమయాన్ని వంట గదిలోనే కేటాయిస్తుంటారు. గంటలు గంటలు పని చేసినా.. కిచెన్ లో పని ఓ పట్టాన పూర్తి కాదు. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి రావడం.. సరైన వస్తువులు లేకపోవడం కూడా దీనికి ఓ కారణం. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు గనుక మీ వంటగదిలో ఉన్నట్లయితే మీ పని చాలా సులభంగా పూర్తవ్వడంతో పాటు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. మరి వంటింట్లో ఉపయోగపడే ఆ కిచెన్ టూల్స్(Kitchen Tools) ఏంటో తెలుసుకుందామా..?

ఈ కిచెన్ టూల్స్ మీ వద్ద ఉన్నాయా?

  • వంట చేయడం కంటే కూరగాయలు, ఉల్లిపాయలు కట్‌ చేయడానికే చాలా సమయం పడుతుంది. అదే మీ వద్ద ‘వెజిటబుల్‌ చాపర్‌ (Vegetable Chopper)’ ఉంటే ఈజీగా కూరగాయలు తరగొచ్చు.
  • కిచెన్​లో కొలతల స్పూన్లు, మిక్సింగ్‌ బౌల్స్‌(Mixing Bowls)ని అందుబాటులో ఉంటే అవసరమున్నప్పుడు వెంటనే వాడుకోవచ్చు.
  • ఉడికించిన కాయగూరలు/పాస్తా/నూడుల్స్‌ వంటివి వడకట్టడానికి, చింతపండు రసం నుంచి గుజ్జును వేరు చేయడానికి చిన్న రంధ్రాలున్న ఓ జల్లెడ లాంటి బౌల్​ ఉంటే ఆ పని ఈజీగా అవుతుంది.
  • వాడుతున్న కొద్దీ వంటింట్లోని కత్తులు పదును కోల్పోతాయి. ఇంట్లోనే ఓ ‘నైఫ్‌ షార్ప్‌నర్‌ (Knife Sharpener)’ ఉంటే ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు.
  • వంటింట్లో పదార్థాలు అమర్చిన కవర్లను ప్యాక్‌ చేయడానికి లేదా సీల్‌ చేయడానికి రబ్బర్లను వాడుతుంటారు. లేదా వాటినే ముడి వేస్తుంటారు. కొన్నిసార్లు అవి లీక్ అవ్వొచ్చు. అందుకే వాటికి బదులుగా కొన్ని సీలింగ్‌ క్లిప్స్‌ (Sealing Clips)ని దగ్గరుంచుకోవాలి.
  • ఏవైనా సీల్‌ చేసిన మూతలు ఓపెన్‌ చేయాలంటే కాస్త కష్టపడాల్సిందే. అదే మీ వద్ద క్యాన్‌ ఓపెనర్ (Can Opener) ఉంటే పని ఈజీ అవుతుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *