Bus Accident: లోయలో పడిన బస్సు.. ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి

ManaEnadu: జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir)లో ఘోర ప్రమాదం(Bus Accident) చోటు చేసుకుంది. బుద్దామ్ జిల్లాలో 29 మంది సైనికుల(Jawans)తో వెళ్తున్న బస్సు బ్రిల్ బుద్గాం(Budgam) గ్రామ సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు దుర్మరణం చెందారు. క్షతగాత్రులను(Injured have been rescued) రక్షించి వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా రెండో దశ ఎన్నికల(Second Phase elections) కోసం జవాన్లకు విధులు నిర్వర్తించేందుకు సైనికులంతా బస్‌(Bus)లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు(Locals reached) ఘటనా స్థలానికి చేరుకొని తమకు సమాచారం అందించారని స్థానిక పోలీసులు(Local police) తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకొని బస్సులో చిక్కుకుపోయిన జవాన్లను రక్షించినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు(Senior officials) సైతం ఘటనా స్థలికి చేరుకొని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అయితే ఇప్పటి వరకూ దీనికి గల కారణాలు తెలియరాలేదు.

ఇటీవల ఆర్మీ జవాన్లకు గాయాలు

ఇటీవల జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ(Rajaouri)లోనూ ఆర్మీ జవాన్లు(Army soldiers) ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వాహనం అదుపుతప్పి 400 అడుగుల లోతున్న లోయలోకి వాహనం దూసుకుపోయింది. ఈ ఘటనలో పారామిలటరీకి చెందిన సైనికులు, ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో సహా లోయలో పడిపోయింది. ఆ సమయంలో వాహనంలో ఆరుగురు కమాండోలు, ఒక లాన్స్ నాయక్(Lance naik) ఉన్నారు. వీరిలో లాన్స్ నాయక్ మరణించగా.. కమాండోలు గాయాలతో బయటపడ్డారు.

 ప్రశాంతంగా ముగిసిన తొలి దశ ఎన్నికలు

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌(J&K)లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు(Assembly Segments) ఉండగా, తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ PK పోలె తెలిపారు. కిశ్త్‌వాడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదు కాగా, పుల్వామా(Pulwama)లో అత్యల్పంగా 46 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కాగా రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న జరగనుంది. మూడో దశ పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. OCT 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *