Dasara Bonus: ఆ కార్మికులకు తీపికబురు.. దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

ManaEnadu: తెలంగాణలోని సింగ‌రేణి కార్మికుల(Singareni Collieries Workers)కు సీఎం రేవంత్(CM Revanth Reddy) రెడ్డి శుభవార్త చెప్పారు. దసరా(Dasara)కు ముందే కార్మికులకు బోనస్(Bonus) ప్రకటించారు. ఈ నిర్ణయంతో కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లువిరుస్తుందని CM అన్నారు. కాగా గ‌తేడాది సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాల(Profits) ఆధారంగా బోన‌స్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు. ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు, కాంట్రాక్ట్ కార్మికుల‌(Contract Workers)కు రూ.5 వేలు చొప్పున బోన‌స్ ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధ‌నలో సింగ‌రేణి కార్మికుల కృషి ఎనలేదని అన్నారు. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం కొనియాడారు. అనంత‌రం సింగ‌రేణి లాభాలు, విస్త‌ర‌ణ‌, బోన‌స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క(Deputy Cm Bhatti Vikramarkra) మీడియాకు వివ‌రించారు.

మూడో వంతు లాభాలు కార్మికులకే..

రాష్ట్రానికే త‌ల‌మానికంగా ఉన్న సింగరేణి సంస్థ(Singareni Collieries) రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా(Coal supply) చేయ‌డంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు బొగ్గు ఎగుమ‌తి చేస్తోందని భట్టి అన్నారు. సింగ‌రేణి కార్మికుల శ్ర‌మ‌తో 2023-24 సంవ‌త్స‌రంలో సంస్థ‌కు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం స‌మ‌కూరిందని చెప్పుకొచ్చారు. ఇందులో సంస్థ విస్త‌ర‌ణ‌, పెట్టుబ‌డుల‌కు రూ.2,289 కోట్లు కేటాయించ‌గా మిగిలిన‌వి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు రూ.796 కోట్ల‌ను కార్మికుల‌కు బోన‌స్‌గా ప్ర‌క‌టించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

 గత ఏడాది కంటే ఈసారి అదనం

కాగా సింగ‌రేణిలో మొత్తం 41,387 మంది శాశ్వ‌త కార్మికులు(Permanent workers), ఉద్యోగులు(Employees) ఉన్నారు. ఒకొక్క‌రికి బోన‌స్ కింద రూ.1.90 ల‌క్ష‌లు అందిస్తామని ఆయన చెప్పారు. గ‌తేడాది సింగ‌రేణి కార్మిల‌కు అందిన బోన‌స్‌ రూ.1.70 ల‌క్ష‌లు మాత్ర‌మే. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకొక్క‌రికి అద‌నంగా అందుతున్న మొత్తం రూ.20 వేలను తమ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల‌కూ బోనస్ సింగ‌రేణి చ‌రిత్ర‌లోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం(State Govt) బోన‌స్ ప్ర‌క‌టించింది. సంస్థ‌లో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు తొలిసారిగా రూ.5 వేల బోన‌స్‌ను అంద‌జేస్తున్న‌ట్లు భ‌ట్టి తెలిపారు. అలాగే సింగ‌రేణి కార్మికులు, ఉద్యోగుల పిల్ల‌ల కోసం నూత‌న రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు(Residential Schools), ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌, ఏరియా ఆసుప‌త్రుల(Area hospitals) ఆధునికీక‌ర‌ణ‌తో పాటు HYDలో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని డిప్యూటీ సీఎం వెల్ల‌డించారు.

Related Posts

KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *