ManaEnadu: జమ్మూకశ్మీర్(Jammu & Kashmir)లో ఘోర ప్రమాదం(Bus Accident) చోటు చేసుకుంది. బుద్దామ్ జిల్లాలో 29 మంది సైనికుల(Jawans)తో వెళ్తున్న బస్సు బ్రిల్ బుద్గాం(Budgam) గ్రామ సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు దుర్మరణం చెందారు. క్షతగాత్రులను(Injured have been rescued) రక్షించి వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా రెండో దశ ఎన్నికల(Second Phase elections) కోసం జవాన్లకు విధులు నిర్వర్తించేందుకు సైనికులంతా బస్(Bus)లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు(Locals reached) ఘటనా స్థలానికి చేరుకొని తమకు సమాచారం అందించారని స్థానిక పోలీసులు(Local police) తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకొని బస్సులో చిక్కుకుపోయిన జవాన్లను రక్షించినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు(Senior officials) సైతం ఘటనా స్థలికి చేరుకొని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అయితే ఇప్పటి వరకూ దీనికి గల కారణాలు తెలియరాలేదు.
ఇటీవల ఆర్మీ జవాన్లకు గాయాలు
ఇటీవల జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ(Rajaouri)లోనూ ఆర్మీ జవాన్లు(Army soldiers) ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వాహనం అదుపుతప్పి 400 అడుగుల లోతున్న లోయలోకి వాహనం దూసుకుపోయింది. ఈ ఘటనలో పారామిలటరీకి చెందిన సైనికులు, ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో సహా లోయలో పడిపోయింది. ఆ సమయంలో వాహనంలో ఆరుగురు కమాండోలు, ఒక లాన్స్ నాయక్(Lance naik) ఉన్నారు. వీరిలో లాన్స్ నాయక్ మరణించగా.. కమాండోలు గాయాలతో బయటపడ్డారు.
ప్రశాంతంగా ముగిసిన తొలి దశ ఎన్నికలు
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్(J&K)లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు(Assembly Segments) ఉండగా, తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ PK పోలె తెలిపారు. కిశ్త్‌వాడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదు కాగా, పుల్వామా(Pulwama)లో అత్యల్పంగా 46 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కాగా రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న జరగనుంది. మూడో దశ పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. OCT 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | J&K: 32 BSF personnel injured and 3 lost their lives after their bus rolled down a hilly road and fell into a gorge in Brell Waterhail area of Central Kashmir's Budgam district. Driver of the bus also injured. The bus was engaged in election duty. https://t.co/NPccSx5xrZ pic.twitter.com/d4N60b6qxr
— ANI (@ANI) September 20, 2024