త్రిష కృష్ణన్(Trisha Kirshnan).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భామ. వర్షం మూవీతో తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)కి పరిచయమైన ఈ తమిళ బ్యూటీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో అతడు(Athadu), నమో వెంకటేశ(Namo Venkatesha), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీల్లో నటించింది. ఇక ఇటీవల “గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Agly)” మూవీలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్(Thug Life)’ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర(Vishwambhara)’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.
![]()
40 ఏళ్లు వచ్చినప్పటికీ..
ఇక త్రిషకు (Trisha) 40 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ వివాహ వ్యవస్థ(marriage system)పై తనకు నమ్మకం లేదని చెప్పింది. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె స్పష్టం చేసింది. ఆమె పెళ్లిపై కొంతకాలంగా వదంతులు వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఈ తమిళ బ్యూటీ ఇలా స్పందించింది.
అలాంటి పరిస్థితి నాకు ఎదురు కాకూడదు..
‘‘పెళ్లి(Marriage) ఎందుకు చేసుకోలేదు అంటే నా వద్ద సమాధానం లేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో మాత్రం నాకే తెలియదు. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం నాకు తోడు ఉంటాడనే నమ్మకం కలగాలి. అప్పుడే చేసుకుంటాను. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితి నాకు ఎదురుకాకూడదు’’ అని క్లారిటీ ఇచ్చింది త్రిష.
Yes,dreams do come true,and she is the living example of that. Once,she dreamed it,made it happen, and now she’s living it. Trish,I’ll always be proud of you for what you do.Keep slaying, Lbyu ❤️🧿 Also lol, I’ve put my heart and soul into this edit 😭
✩ @trishtrashers #Trisha pic.twitter.com/eumTtwmErB
— TrishEra (@sabtumharahai) April 19, 2025






