తిరుమల బ్రహ్మోత్సవాలు .. ఒక్కరోజులోనే శ్రీవారి దర్శనం

Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Tirumala Temple) దర్శనానికి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఆ భక్తుల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రద్దీ ఎక్కువయ్యి శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు రెండు మూడు రోజులైనా శ్రీవారి దర్శన భాగ్యం కలగదు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది.

ఒక్క రోజులోనే స్వామి దర్శనం

శ్రీవారి బ్రహ్మోత్సవాల (Tirumala Bramhotsavam) సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఒకే రోజు స్వామివారితో పాటు వాహనసేవల దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాటు చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతోపాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. స్వయంగా వచ్చే వీఐపీలకే దర్శన (VIP Darshan) అవకాశం ఉండనుంది. శ్రీవారి గరుడ సేవ (Garuda Seva) జరిగే 8వ తేదీన వీఐపీ దర్శనం కూడా రద్దు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనాల్లో సామాన్యులకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. 

1.32 లక్షల టికెట్లు

ఈ సందర్భంగా టీటీటీ ఈవో శ్యామల రావు (TTD EO Shyamala Rao) మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం 1.32 లక్షల టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో సర్వదర్శనం కోసం వచ్చే వారికి రోజుకు 24వేల టోకెన్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే వాహన సేవలను తిలకించేందుకు పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

గరుడ సేవ రోజు పకడ్బందీ ఏర్పాట్లు

గరుడ సేవ (Tirumala Garuda Seva) సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుందని ఈవో శ్యామల రావు తెలిపారు. ఈ వేడుకను రెండు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించే విధంగా గ్యాలరీలను, వారికి అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించారు. ఆ రోజు తిరుమల కొండపైకి 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. ఇక తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే కాకుండా కొండపై పలు ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉంచుతామని వివరించారు.

పిల్లలకు స్పెషల్ ట్యాగ్స్

‘గరుడ సేవనాడు ఉదయం ఏడింటినుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్నదాన సత్రం అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో 3.5 లక్షల లడ్డూలను ఇస్తున్నాం. ఉత్సవాల నేపథ్యంలో మరో ఏడు లక్షల నిల్వలు అందుబాటులో ఉంచుతాం. ప్రసాదాల పంపిణీకి మరో 11 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. భద్రత దృష్ట్యా 12 ఏళ్లలోపు పిల్లలకు గుర్తించేందుకు వారికి ట్యాగ్‌ వేస్తున్నాం.’ అని శ్యామల రావు తెలిపారు.

 

Share post:

లేటెస్ట్