తిరుమలలో పవన్ చిన్న కూతురి డిక్లరేషన్.. ఫొటోలు చూశారా?

Mana Enadu : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన ఇద్దరు కూతుళ్ల (ఆద్య, పొలెనా అంజన)తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే పవన్ చిన్న కూతురు పొలెనా (Polena Anjani) క్రిస్టియన్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొలెనా టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేసింది. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

తిరుమలలో డిక్లరేషన్ వివాదం

ఇటీవలే మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం (Tirumala Declaration Controversy) నెలకొన్న విషయం తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం తర్వాత హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ పై సంతకం చేశాకే అనుమతివ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో జగన్ (Ex CM Jagan) తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయ్యింది.

 

తిరమలలో పవన్ చిన్న కుమార్తె డిక్లరేషన్

ఈ వివాదం నడుస్తున్న వేళ తాజాగా పవన్ కల్యాణ్ తన చిన్న కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం, తండ్రిగా తానూ సంతకం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Controversy)లో కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష ముగింపు కోసం ఆయన అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు.

దీక్ష విరమించనున్న పవన్ కల్యాణ్

ఇవాళ శ్రీవారి (Tirumala Srivaru)ని దర్శించుకుని, దీక్ష విరమించనున్నారు. ఈ క్రమంలో రెండ్రోజుల పాటు ఆయన కొండపైనే బస చేయనున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించి అన్న ప్రసాదం, లడ్డూ తయారీ ప్రక్రియలను పరిశీలించనున్న పవన్.. లడ్డూ నాణ్యత, టీటీడీ (TTD) అందిస్తోన్న సేవలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనతో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

 

Share post:

లేటెస్ట్