
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన నిర్ణయాలతో విదేశాలతోపాటు అమెరికన్లకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ రూల్స్(Immigration Rules)ను స్ట్రిక్ట్ చేసిన ట్రంప్.. USలో కేవలం పరుషులు(Male), స్త్రీల(Female)కు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్‌ను గుర్తించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. అటు మహిళల క్రీడల(Sports)లోనూ ట్రాన్స్ జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు. తాజాగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు.
ఆ టైంలో లింగ మార్పిడికి అనుమతించం: ట్రంప్
US ఆర్మీ(Army)లోకి ఇకపై ట్రాన్స్‌జెండర్లను ఎంపిక చేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సైన్యంలో ట్రాన్స్ జెండర్ల(Transgenders in the US Army) ఎంట్రీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.పైగా ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ చెప్పారు. ట్విటర్ (X) వేదికగా యూఎస్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లింగ మార్పిడి(Gender reassignment)కి అనుమతించబోమని స్పష్టం చేసింది. లింగ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించి ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉన్న దరఖాస్తులను అన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లు పూర్తికాలం సేవలందించవచ్చని పేర్కొంది. కాగా, ప్రస్తుతం అమెరికా సైన్యంలో దాదాపు 16000 మంది ట్రాన్స్ జెండర్లు సేవలు అందింస్తున్నారు. అయితే ప్రభుత్వ స్కీములు(Govt Schemes), ఇతర సందర్భాలలో కేవలం మగ, ఆడ జెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ట్రంప్(Trump) ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.