
బాంబు పేలుళ్ల(Israel blasts)తో ఇజ్రాయెల్ మరోసారి దద్దరిల్లింది. రాజధాని టెల్ అవివ్‌లో ఆగిఉన్న మూడు బస్సు(Israel bus blasts)ల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద దాడిగా అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగా.. ఇలాంటి ఘటన జరగడంతో ఇజ్రాయెల్ షాక్ అయింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 5 బాంబులు ఒకేలా ఉన్నాయని, వాటికి టైమర్లు అమర్చారని ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు. పేలని బాంబులను బాంబు స్క్వాడ్(Bomb squad) నిర్వీర్యం చేసిందని అన్నారు.
వెస్ట్ బ్యాంక్‌లో ఆర్మీ ఆపరేషన్‌కు ప్రధాని ఆదేశం
ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం(IPMO) ప్రకటించింది. దీనిపై ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) అత్యవసర భద్రతా సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఆపరేషన్( West Bank military operation) నిర్వహించాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించారు. ఈ బాంబు దాడులపై షిన్ బెట్ అంతర్గత భద్రతా సంస్థ దర్యాప్తును నిర్వహిస్తోందని, అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బాట్ యామ్ మేయర్ బ్రోట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా గత నెల 19న ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire agreement between Israel and Palestine) కుదిరింది.
BREAKING: Suspicion of a combined Terror attacks on busses in central Israel : explosive devices on 5 buses in Bat Yam and Holon, 3 of which exploded
Three explosions in three separate parking lots in Bat Yam and Holon – and miraculously no casualties. The police began extensive… pic.twitter.com/4PCpfTHrF1— Iris (@streetwize) February 20, 2025