
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)కి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదాని(Car road accident)కి గురైంది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు వెస్ట్ బెంగాల్(West Bengal)లోని బుర్ద్వాన్ యూనివర్సిటీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వే(Durgapur Expressway)లోని దంతన్‌పూర్ వద్ద ఓ లారీ(Lorry) అకస్మాత్తుగా గంగూలీ కాన్వాయ్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చింది. దీంతో గంగూలీ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో వెనుక వచ్చిన కార్లు గంగూలీ ఉన్న కారుతో పాటు ఇతర కార్లకు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే.. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Indian Cricketer Sourav Ganguly Survived With the Car accident in Durgapur Express Way. 🤯
|#caraccident|#SouravGanguly|#DurgapurExpressway| pic.twitter.com/6MhtLnqHwX
— Omkar Ugale (@Omkarugale2811) February 21, 2025
విద్యార్థులతో ముచ్చటించిన దాదా
ఘటన జరిగిన వెంటనే గంగూలీ కారు దిగి మిగిలిన వారిని పరామర్శించాడు. ఈ ఘటన కారణంగా దాదాపు పది నిమిషాలు గంగూలీ రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఆతరువాత యథావిధిగా అతడు షెడ్యూల్ చేసిన కార్యక్రమానికి హాజరయ్యాడు. కలవరపెట్టే ఘటన జరిగినప్పటికీ విద్యార్థుల(Students)తో సంభాషించాడు. తన క్రికెట్ కెరీర్‌లోని కొన్ని సంఘటలను పంచుకున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తు(Future of Indian Cricket) గురించి చర్చించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో గంగూలీ రికార్డులు ఇలా..
కాగా 1992 అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన దాదా 2008 వరకు టీమ్ఇండియా(Team India)కు ప్రాతినిధ్యం వహించాడు. 113 టెస్టుల్లో 42.2 యావరేజ్‌తో 7,212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 311 వన్డేల్లో 41 సగటుతో 11,363 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 72 అర్థశతకాలు ఉన్నాయి. ఇక 59 IPL మ్యాచ్‌లు ఆడాడు. 25.4 సగటుతో 1,349 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్యక్షుడిగా(President)నూ గంగూలీ పని చేశాడు.