‘సంక్రాంతికి వస్తున్నాం’.. ముందు టీవీలో ఆ తర్వాతే ఓటీటీలో

ఈ ఏడాది సంక్రాంతి రేసులో గెలిచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా వెంకటేశ్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు చేసింది. సినిమా విడుదలై దాదాపు నెల రోజులకు దగ్గరపడుతున్నా, ఇప్పటికీ చాలా థియేటర్స్‌లో ఆక్యుపెన్సీ బాగుంది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో  వస్తుందా? మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ట్విస్ట్

‘సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunam ott release date)’ సినిమా డిజిటల్ పార్ట్నర్ జీ5 ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ప్రేక్షకులకు ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న జీ5/జీతెలుగు ..  తాజాగా  ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. ‘మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి రెడీగా ఉండండి’ అంటూ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ పోస్టుకు ఓటీటీ కన్నా ముందే టీవీలో అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. ఇది చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.

ముందు టీవీ.. ఆ తర్వాతే ఓటీటీ

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మొదట టెలివిజన్‌ ప్రీమియర్‌గా అలరించనుంది. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందట. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతుండటంతో ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఇటీవల బాగా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ పుకార్లన్నింటిని పటాపంచలు చేస్తూ మరో ట్విస్ట్‌ ఇస్తూ మొదట టెలివిజన్‌ ప్రీమియర్‌గా రానుంది.

యూట్యూబ్ లో ట్రెండ్

వెంకటేశ్ ప్రధాన పాత్రలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్ అందించగా దాదాపు 17 ఏళ్ల తర్వాత రమణ గోగుల మళ్లీ తన గొంతును తెలుగు ప్రేక్షకులకు వినిపించారు. ఈ సినిమాలో ఆయన పాడిన ‘గోదారి గట్టు’ పాట సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో ఆ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఇక ఈ మూవీతో వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ కొట్టింది (ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం).

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *