ఛత్రపతి శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj) జీవిత కథతో బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ‘ఛావా (Chhaava)’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా అదరగొట్టాడు. ఇక శంభాజీగా మాహారాజ్ గా విక్కీ నటనకు ప్రేక్షకులే కాదు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు.
ఛావా బీటీఎస్ వీడియో
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ (Chhaava BTS Video) నుంచి విక్కీ తాజాగా బీటీఎస్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇందులో శంభాజీ మహారాజ్ గా విక్కీ ఎలా మారాడో చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విక్కీ డెడికేషన్ కు ఫిదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఛావాగా విక్కీని తప్ప మరే హీరోను ఊహించుకోలేమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
ఛావా రికార్డు స్థాయి కలెక్షన్లు
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఆ చిత్రం హిందీలో రూ.516 కోట్లు వసూల్ చేసింది. కేవలం 25 రోజుల్లోనే బాలీవుడ్‌లో ‘బాహుబలి 2 (Baahubali 2) (రూ.510 కోట్లు)’ రికార్డును అధిగమించి హిస్టరీ క్రియేట్ చేసింది. హిందీ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా ‘ఛావా’ (Chhaava Collections) లిస్ట్‌లో నిలిచిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఓటీటీలోకి ఛావా
మరోవైపు ఛావా ఓటీటీ రిలీజ్ డేట్ (Chhaava Ott News) గురించి నెట్టింట ప్రచారం సాగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఛావా మూవీ ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అయితే ప్రస్తుతం ఛావా మూవీ తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నందున ఇప్పట్లో ఓటీటీలోకి రావడం కష్టమని కొందరు అంటున్నారు.






