
ఏపీ పాలిటిక్స్‌లో ‘గేమ్ ఛేంజర్’గా మారి హిస్టరీ క్రియేట్ చేసిన నేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సరిగ్గా 12 ఏళ్ల క్రితం జనసేన(Jana Sena) పార్టీని స్థాపించి ఇప్పుడు 21మంది MLAలతో 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా నిలిచింది. జనసేన గెలుపుతో APలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాల(Janasena Foundation Day celebrations)ను ఘనంగా నిర్వహించేందుకు పవన్ పార్టీ సిద్ధమైంది.
లక్షలాది మంది వచ్చే అవకాశం
ఇందుకు ‘‘సాహసించాం.. సంగ్రమించాం.. సంభ్రమించే విజయం సాధించాం రండి పొంగే కెరటాల్లా ఉత్సవం చేసుకుందాం’’ అనే పిలుపుతో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలోని చిత్రాడలో నిర్వహించే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జయకేతనం పేరుతో ఆ పార్టీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు దాదాపు పూర్తకావొచ్చాయి. పవన్‌తోపాటు పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో భారీ సభాప్రాంగణాన్ని సిద్ధం చేశారు.
‘జనసేన జయకేతనం’
పోరాటంగా ప్రారంభమై
ప్రజ్వలలా ప్రకాశిస్తూ
ప్రభంజనంలా పరిభ్రమిస్తున్న జనసేన పార్టీ12వ ఆవిర్భావ సభ
మార్చి 14న
పిఠాపురంలోకలిసి రండి, సంబరాల్లో పాల్గొనండి..!!#JanaSenaFormationDay#ChaloPithapuram pic.twitter.com/ux0O3QQOV1
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2025
1600 మంది పోలీసులతో బందోబస్తు
ఇక అక్కడి ఏర్పాట్లను మంత్రులు, పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), కందుల దుర్గేష్(Kandula Durgesh) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చేవారి కోసం భోజనం, మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ సిబ్బందిని సిద్ధం చేశారు. ఇక వీర మహిళలు, మహిళా కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మార్చి 14న సాయంత్రం 3.30కు సభ ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు సుమారు 10లక్షల మంది వస్తారని అంచనా.