ఆ మూడు బీసీ స్థానాలపై గురిపెట్టిన వరంగల్​ భాజపా


వరంగల్​: తెలంగాణ రాష్ర్టానికి బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో అధికారపార్టీ ముందుంది. కానీ భాజపా మాత్రం సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకుని వడపోత చేస్తుంది. ఈక్రమంలోనే ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఉన్న 12నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా 3స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలో నింపేలా కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ2,ఎస్టీ 3స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను దింపబోతుంది. మిగిలిన జనరల్​ 7స్థానాల్లో 3స్థానాల్లో ఖచ్చితంగా బీసీలకే కేటాయించేందుకు పార్టీ పెద్దలు ఆలోచన చేశారు.

 

పరకాల చూపు@ డాక్టర్​ వైపే
పరకాల నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గానికి చెందిన మరో బలమైన నేతను బరిలోకి దించేందుకు భాజపా సిద్దం అయింది. 35ఏళ్లుగా ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండటంతోపాటు కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం జిల్లా ప్రజలకు సుపరిచితుడైన డాక్టర్​ కాళీ ప్రసాద్​ బరిలోకి దించడానికి కషాయం పెద్దలు సిద్దం అయ్యారు. వరంగల్ పట్టణంలో గార్డియన్ హాస్పిటల్ స్థాపించి పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడంలో ప్రజల మెప్పు పొందారు.
ఇప్పటికే పరాకాల నియోజకవర్గంలో ప్రతిగ్రామం తిరుగుతూ తనదైన శైలిలో పార్టీ అభివవృద్ధికి కృషి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా డాక్టర్​నే గెలిపించుకుంటామని పల్లెలు తీర్మణాలు చేసే పరిస్థితి వచ్చింది. పరకాలలో కషాయం జెండా డాక్డర్​తోనే ఎగరడం సాధ్యం అవుతుందనే జిల్లా నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలకు సంకేతాలు పంపారు

జనగామ టిక్కెట్​..విద్యార్ధి ఉద్యమ నేతకే సై..?!

తెలంగాణ రాష్ర్ట సాధనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా జేఏసీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా మద్దెల సంతోష్​ ముదిరాజ్​ పనిచేశారు. సొంతూరు వెంకిర్యాల గ్రామంలో తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంటర్​, డిగ్రీ జనగామ కేంద్రంలో చదివారు. దీంతో స్థానిక సమస్యలపై పూర్తి అవగాహనతోపాటు, యువతలో బలమైన నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చేశారు. MA అర్థశాస్త్రంతోపాటు  PhD చేయడంతో ఉన్నత విద్యావంతుడిగా జనంకు సేవ చేసే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తుంది.పేద విద్యార్థులకు ప్రైవేటు కళాశాల ఫీజుల కష్టాల కట్టడి కృషి చేశారు. గతంలో కాంగ్రెస్​ పార్టీలో క్రీయశీలకంగా పనిచేయంతోపాటు నేరుగా 4వేల కుటుంభాల సంబంధాలు ఉన్న నేతగా అనతికాలంలో గుర్తింపు సంపాదించుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి జనగామ నియోజకవర్గంలో 45 వేల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. దీంతో భాజపా బీసీ సామాజిక వర్గానికి చెందిన మద్దెల సంతోష్​ ముదిరాజ్​ బరిలో నిలిపితే గెలుపు సులువుగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న సంతోష్​ ముదిరాజ్​కి పార్టీ పెద్దలు టిక్కెట్​ కన్ఫర్మ్​ చేయడమే మిగిలింది. క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాలని పార్టీ పెద్దలు సూచించారని సమాచారం.

 

పాలకుర్తి బరిలో..పోరాటాల బిడ్డ
కమ్యూనిస్టు పార్టీతో ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిన విద్యార్ధి, రైతుసంఘం నాయకుడిగా బక్కనాగరాజు వరంగల్​ ప్రాంతవాసులకు సుపరిచితమైన పేరు. తెలంగాణ ఉద్యమంలో తనదైనశైలిలో పోరాటాలు చేస్తూ నల్గొండ జిల్లా జైలులో జైలు జీవితం సైతం గడిపాడు. 2001లో ఇప్పటి బీఆర్​ఎస్..అప్పటి టీఆర్​ఎస్​ పార్టీలో చేరాడు. క్రమంగా అధికారం సాధించాక సీఎం కేసీఆర్​ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని పార్టీకి దూరంగా ఉన్నాడు. కాంగ్రెస్​ అభ్యర్థికి మద్దతు పలికారు. తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఈటెల రాజేందర్​తో ఉన్న సంబంధాలతో భాజపా గూటికి చేరారు. దీంతోపాటు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి బక్కా నాగరాజు యాదవ్​ కృషి చేశారు. ఇక్కడ కూడా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించడంతో బక్కానాగరాజ్​ యాదవ్​ పేరు పార్టీ ఖారారు చేసే అవకాశం కన్పిస్తుంది.

 

వీటితోపాటు వరంగల్​ జిల్లాలో బీసీలను గుర్తిస్తున్న భాజపా ప్రకటించే అభ్యర్ధులపై ప్రజల మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ మూడు స్థానాలతో పాటు మరో 3నుంచి 4స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులను గెలిపించుకునేలా ప్రజలు తీర్పు ఉండబోతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

Share post:

లేటెస్ట్