మీ అకౌంట్ హ్యాక్ అయ్యాక తల పట్టుకోవడం కన్నా.. 2FA గురించి తెలుసుకోవడం మిన్న

Mana Enadu : సాధారణంగా మీరు మీ ‘X'(Twitter) అకౌంట్ కు యూజర్ నేమ్, పాస్ వర్డ్ పెడుతుంటాం. కానీ పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా లేకపోతే మీ అకౌంట్ హ్యాక్ కు గురయ్యే అవకాశం ఉంది. అలా హ్యాకింగ్ కు గురవ్వకుండా ఉండేందుకు చాలా మంది OTP (One Time Password)ని సెట్ చేసుకుంటారు. ఒకవేళ మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎవరికైనా తెలిసినా.. OTP లేకుండా మీ అకౌంట్ యాక్సెస్ చేయడం కుదరదు. 

అయితే కొన్నిసార్లు OTP కూడా హ్యాకయ్యే ప్రమాదం ఉందంటున్నారు టెక్ నిపుణులు. డూప్లికేట్ సిమ్ కార్డు పొందే సౌకర్యంలో ఉన్న వెసులుబాటుతో కొందరు హ్యాకర్లు Sim swap పధ్ధతి ద్వారా OTP దొంగిలిస్తున్నారు. మరోవైపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కాల్స్ & SMSల కోసం Signaling System 7 (SS7) అనే ఒక ప్రోటోకాల్లోని vulnerability వాడుకొని SS7 attack పద్ధతితో హ్యాకర్లు ఫోన్/sms  మనకు చేరే లోపే అడ్డగించి వాటిని దొంగిలిస్తున్నారు. ఇలా కూడా మన అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మీ అకౌంట్లు హ్యాక్ (Account Hacking) అవ్వకుండా.. మీ వ్యక్తిగత వివరాలు థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే క్లిష్టమైన పాస్వర్డ్ & 2FA ఎనేబుల్ చేస్కోవడం తప్పనిసరి అంటున్నారు టెక్ నిపుణులు. ఇంతకీ 2FA అంటే ఏంటి..? దాన్నెలా యాక్టివేట్ చేసుకోవాలి..?

Google Authenticator, Microsoft Authenticator లేదా Authy వంటి యాప్స్ ద్వారా ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో OTP తయారు చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే 2FA ఎనేబుల్ చేసుకొని ఉండకపోతే వెంటనే పాస్వర్డ్ క్లిష్టంగా మార్చి 2FA ఎనేబుల్ చేసుకోవడం మంచిది.

Google Authenticator ద్వారా 2FA ఎనేబుల్ చేయడం ఎలా?

  • Step 1: యాప్ ఇంస్టాల్ చేయాలి. Android / ios
  • Step 2: https://twitter.com/settings/account/login_verification
  • Step 3: Authentication app సెలెక్ట్ చేయాలి
  • Step 4: Get started క్లిక్ చేయాలి
  • Step 5: స్క్రీన్ పైన కనిపించిన QR కోడ్ గూగుల్ ఆథెంటికేటర్ యాప్ లో “+” నొక్కి QR స్కాన్ చెయ్యాలి. అప్పుడు ట్విటర్ అకౌంట్ ఆథెంటికేటర్లో యాడ్ అయ్యి ఆరు అంకెల నంబర్ కనిపిస్తుంది
  • Step 6: Enter the confirmation code అని అడిగినప్పుడు ఆ ఆరు అంకెల కోడ్ ఎంటర్ చేయాలి. అప్పుడు You’re all set అని ఒక బ్యాకప్ కోడ్ వస్తుంది. 

ఈ కోడ్ ను భద్రపరుచుకోవాలి. ఎప్పుడైనా మీ మొబైల్ పోయినా.. యాప్ లాగౌట్ అయినా ఈ బ్యాకప్ కోడ్ ద్వారా మళ్లీ లాగిన్ అవ్వొచ్చు. అయితే ఈ కోడ్ కేవలం ఒకసారి మాత్రమే పనిచేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి.

Share post:

లేటెస్ట్