RCB: ఆర్సీబీకి ‘హిందీ’ సెగలు.. కొత్త ట్విటర్ అకౌంట్‌పై ఫ్యాన్స్ ఫైర్

కేంద్ర ప్రభుత్వం(Central Govt) దేశవ్యాప్తంగా హిందీ భాష(Hindi language)ను అన్ని రాష్ట్రాలపై రుద్దాలని భావిస్తోందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్(Tamil Nadu CM Stalin) ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలో హిందీని బలవంతంగా అంటగట్టాలని చూస్తే సహించేది లేదని స్టాలిన్ ఇదివరకే పలుమార్లు తేల్చిచెప్పారు. తాజాగా ఈ వ్యవహారం ఐపీఎల్(Indian Premier League) టీమ్ అయిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌(RCB)కీ అంటుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే RCB కొత్తగా హిందీలో ట్విటర్ ఖాతా (X) ఓపెన్ చేయడంతోపాటు హిందీలో ట్వీట్లు చేయడం మొదలుపెట్టింది. ఇకేంముంది.. దీంతో కన్నడీగులు మండిపడుతున్నారు. తెలుగు(Telugu)లో ఎందుకు (X) ఖాతా ఓపెన్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

 తెలుగులో ఎందుకు తెరవలేదు: ఫ్యాన్స్

RCBకి ఎక్స్‌లో ఇంగ్లిష్‌తోపాటు కన్నడలో కూడా అఫీషియల్ అకౌంట్లు ఉన్నాయి. కన్నడ ఎక్స్‌లో కన్నడ భాషలో మాత్రమే పోస్టులు పెడతారు. ఆర్సీబీ ఇంగ్లిష్ ఎక్స్ అకౌంట్‌లో మాత్రం మెజారిటీ పోస్టులు ఇంగ్లిషులో ఉంటాయి. అప్పుడప్పుడు RCB కన్నడ ఎక్స్ పోస్టులు ఇక్కడ షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో Hindiలో ఎక్స్ అకౌంట్ తెరవడంపై కన్నడ RCB fans ఫైర్ అవుతున్నారు. ఇది కన్నడ భాషను అవమానించడమేనని వారు అంటున్నారు. హిందీలో పెట్టినప్పుడు తెలుగులో ఎక్స్ ఖాతా ఎందుకు పెట్టరు అని ప్రశ్నిస్తున్నారు. ఆర్సీబీలో కన్నడ స్పిరిట్ లేదని, అందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే ఆ ఫ్రాంచైజీ(Franchise)ని వదిలేసి నార్త్ సిటీలతో కొత్త ఫ్రాంచైజీ పెట్టుకోవాలని అంటున్నారు.

స్టార్ ప్లేయర్లను వదులుకుని తప్పు చేసిందా?

ఇదిలా ఉండగా ఈసారి IPLలో ఆర్సీబీ పలువురు స్టార్ ప్లేయర్లను దూరం చేసుకుంది. మ్యాక్స్ వెల్(Glenn Maxwell) సిరాజ్ వంటి ప్లేయర్లను వేలానికి వదిలేసింది. వచ్చే సీజన్లో ఆ జట్టు ప్లేయర్ల వివరాలు ఇవే.. విరాట్ కోహ్లీ(Virat Kohli), రజత్ పటీదార్,యశ్ దయాల్‌ను మెగా వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. ఈనెల 24,25 తేదీల్లో జరిగిన మెగా వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్(Tim David), రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికార, లుంగి ఎన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాతీ ఉన్నారు.

Share post:

లేటెస్ట్