World Polio Day 2024: నిండు జీవితానికి రెండు చుక్కలు.. నేడు ప్రపంచ పోలియో దినోత్సవం

Mana Enadu: చిన్నారుల నిండు జీవితాన్ని సురక్షితం చేసేందుకు రెండు చుక్కలు వేసే సమయం వచ్చేసింది. చిన్నారుల్లో వైకల్యానికి(Disability) కారణం అయ్యే పోలియో వైరస్(Polio virus) నుంచి మన పిల్లలను రక్షించుకునేందుకు ప్రభుత్వాలు పోలియో చుక్కల కార్యక్రమాలను ఏటా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నాయి. పోలియో అనేది అత్యంత అంటు వ్యాధి, ఇది ఎక్కువగా చిన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇది నాడీ వ్యవస్థ(nervous system)పై దాడి చేస్తుంది. వెన్నెముక, శ్వాసకోశ, పక్షవాతాని(For spinal, respiratory, paralysis)కి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణాని(death)కీ దారితీస్తుంది.

అవగాహన కల్పించేందుకే..

పోలీయో ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ఒకప్పుడు ప్రపంచ దేశాలను వణికించింది. ఐదేళ్లలోపు పిల్లల(Children under five years of age)కు ఎక్కువగా వస్తుంది. ఈ మహమ్మారిని తరమికొట్టే మహా యజ్ఞంలో రెండు చుక్కల టీకా(Polio Vaccination) ప్రపంచానికి సంజీవనిలా మారింది. ప్రస్తుతం పాక్, అఫ్ఘానిస్థాన్ మినహా అన్నీ దేశాలు దీన్ని నిర్మూలించగలిగాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్ 24న ‘‘ప్రపంచ పోలియో దినోత్సవం(World Polio Day)’’గా నిర్వహిస్తున్నారు.

పోలియో చుక్కల ప్రాముఖ్యత ఏంటి?

పోలియో చుక్కలు వేయించకుంటే పిల్లలు అనారోగ్య పాలవడమే కాకుండా అంగవైకల్యానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. పోలియో చుక్కలు(Polio drops) వేయడం ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని, రోగ నిరోధక శక్తి(Immunity) కూడా పెరుగుతుందని, పోలియో చుక్కలు వేసిన తర్వాత ఒకటి నుంచి రెండు మూడు రోజులపాటు కొద్ది మేరకు ఇబ్బంది ఉంటుందని దానికి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. ఫీవర్ లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు అధికంగా వస్తే స్థానికంగా ఉన్న వైద్యులకు సంప్రదించి.. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని కోరారు. తమ పిల్లలకు విధిగా పోలియో చుక్కలను వేయించాలని వైద్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Governments) విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *