బాలీవుడ్ బ్యూటీస్​తో సీఎం మనవడి ప్రేమాయణం.. అప్పుడు స్టార్ హీరో కూతురితో.. ఇప్పుడు మాజీ మిస్ యూనివర్స్​తో

Mana Enadu: బాలీవుడ్​కు పాలిటిక్స్​కు అవినాభావ సంబంధం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో నటించిన చాలా మంది నటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొంత మంది రాజకీయ నాయకులేమో ఈ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను పెళ్లాడుతున్నారు. ఇటీవలే ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా హీరోయిన్ పరిణీతి చోప్రాను వివాహ మాడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ మాజీ ముఖ్యమంత్రి మనవడు కూడా బాలీవుడ్ బ్యూటీతో ప్రేమలో పడ్డాడట. అయితే హీరోయిన్లతో ప్రేమాయణం ఇతనికి కొత్తేం కాదు. గతంలోనూ ఓ స్టార్ హీరో కుమార్తె, ఇప్పుడు స్టార్ హీరోయిన్​తో ప్రేమాయణం సాగించాడు. ఆమెతో బ్రేకప్ తర్వాత తాజాగా మరో భామతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరతను? ఇతగాడి ప్రేమలో పడ్డ ఆ భామలెవరు?

ఎవరి వీర్ పహారియా?

మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు (కూతురి కుమారుడు) వీర్ పహారియా. వీర్ గతంలో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్​తో ప్రేమాయణం నడిపాడు. కొన్నేళ్ల పాటు రిలేషన్​షిప్​లో ఉన్న ఈ జంట ఏవో కారణాలతో విడిపోయారు. అయితే అప్పుడు సారా ఇంకా హీరోయిన్​గా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక బ్రేకప్ తర్వాత ఈ ఇద్దరూ తమ లైఫ్​లో మూవ్ ఆన్ అయిపోయారు.

వీర్ – సారా లవ్ స్టోరీ?

వీర్-సారా స్టోరీ కంప్లీట్​గా ఎండ్ అయిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇటీవల అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ఈ జంట కలిసి కనిపించడమే కాకుండా డ్యాన్స్ కూడా చేసింది. మళ్లీ ప్యాచప్ అయిందేమో అనుకుంటుంటే బాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీ ఓరీ ఇటీవల పోస్టు చేసిన ఓ వీడియోతో వీర్ పహారియా కరెంట్ గర్ల్​ఫ్రెండ్ సారా కాదని, మరో బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్(Manushi Chhillar)​ అని తేలిపోయింది.

ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మూవీతో తెలుగువారికి పరిచయమైన మాజీ మిస్ యూనివర్స్​, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ వీర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓరీ ఇటీవల తాను తన ఫ్రెండ్స్​తో కలిసి టూర్​కు వెళ్లిన ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో మానుషి, వీర్‌ కలిసి కనిపించారు. వీర్‌ భుజంపై ఆమె సేదతీరుతూ కనిపించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో మానుషి వీర్ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుకార్లపై ఈ ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు.

మానుషి చిల్లర్.. 2017లో మిస్ యూనివర్స్​గా గెలిచింది. అనంతరం ఆమె బాలీవుడ్​లో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’, ‘బడే మియా ఛోటే మియా’ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్​లో వరుణ్ తేజ్​ సరసన సందడి చేసింది. ప్రస్తుతం జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’ కోసం వర్క్‌ చేస్తోంది.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *