Ram Charan: బన్నీని అన్ ఫాలో కొట్టిన చెర్రీ.. కారణమేంటో?

మెగా, అల్లు కుటుంబాల(Mega-Allu Families) మధ్య దూరం పెరుగుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా విభేదాలు జరగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా రామ్ చరణ్(Ram Charan) ఇన్‌స్టా(Instagram)లో బన్నీ(Allu Arjun)ని అన్‌ఫాలో(Unfollow) చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ బావబామ్మర్దులు మాత్రమే కాదు. మంచి స్నేహితులు కూడా.. అలాంటి వారి మధ్య ఏం జరిగింది. అసలు ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారు. అనేది ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు అటు ప్రేక్షుకుల్లోనూ చర్చనీయాంశమైంది. మెగా-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా వారి కుటుంబాల మధ్య దూరం పెరిగిందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచాయి.

ఏపీ ఎన్నికల ప్రచారంలో మొదలైన చిచ్చు

ముఖ్యంగా ఏపీ ఎన్నికల ప్రచారం(AP election campaign) నుంచి రెండు ఫ్యామిలీ మధ్య విభేదాలు(differences) బయటపడ్డాయి. అప్పటి నుంచి అభిమానులు సైతం అల్లు, మెగా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో వార్స్ చేసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప 2(Pushpa2) సినిమాకు, ఆ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్‌ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులకు మెగా కుటుంబం మద్దతుగా నిలవలేదు. పరిశ్రమ మొత్తం మద్దతుగా నిలిచిన మెగా కాంపౌండ్‌ ఒక స్టేట్‌మెంట్‌ రాలేదు.

గేమ్ ఛేంజర్‌పై అల్లు అరవింద్ వ్యంగ్య వ్యాఖ్యలు

ఇక ఇటీవల రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ ఫ్లాప్‌తో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో ఆ సినిమా ఘోర పరాజయంపై అల్లు అరవింద్(Allu Aravind) వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం మెగా అభిమానులకు, ఆ కుటుంబానికి గిట్టలేదు. ఈ కారణంతోనే రామ్ చరణ్ ఇన్‌స్టాలో బన్నీని అన్ ఫాలో చేశారనే వార్తలు జోరందుకున్నాయి. మరి ఇంతకీ ఈ మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య దూరానికి అసలు కారణమేంటనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *