Malkajgiri: బీఆర్​ఎస్​ ప్లాన్​ అదుర్స్​..కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులకు దిమ్మతిరిగే పోస్టర్లు

మల్కాజ్​గిరి పార్లమెంట్​లో బీఆర్​ఎస్​(BRS) ప్లాన్​కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM reventhReddy) సిట్టింగ్​ స్థానం కావడంతో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి(Patnam sunitha Reddy)గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారతీయ జనతాపార్టీ ఈటల రాజేందర్​(etela rajender) బరిలో నిలబెట్టడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీనే ప్రచారం చేసి వెళ్లారు.

బీఆర్​ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi laxmareddy) బీజేపీ, కాంగ్రెస్​ అభ్యర్థులకు దిమ్మతిరిగే కౌంటర్లతో ప్రచారంలో ముందుకెళ్తున్నారు. లోకల్​–నాన్​లోకల్​ మధ్య మల్కాజ్​గిరిలో ఎన్నికల పోరు ఉండబోతుందని బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ధీమాగా జనంలోకి వెళ్తున్నారు. బీజేపీకి ఓటు వేస్తే హుజారాబాద్​ 166కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని , కాంగ్రెస్​కు ఓటు వేస్తే చేవళ్ల 59కిలోమీటర్లు పోవాల్సి ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. అదే బీఆర్​ఎస్​ కు ఓటు వేస్తే లోకల్​గా అందుబాటులో ఉంటానని మైలురాయిపై వేసిన పోస్టర్లు ప్రజలను ఆలోచనలో పడేశాయి.

రాగిడి లక్ష్మారెడ్డి తన గెలుపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బుతో అడ్డుకోలేవని, ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ధీమాగా ఉన్నారు. మల్కాజ్​గిరి ఓటు..వలస నేతలకు కాదు…ఈ సారి లోకల్​ అంటూ జనం సిద్దమయ్యారని బీజేపీ, కాంగ్రెస్​ అభ్యర్థులు దుకాణం సర్దుకోవాని బీఆర్​ఎస్​ నేతలు చెబుతున్నారు.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *