Vinesh Phogat: నాడు రోడ్లపై కొట్లాడింది.. నేడు రింగు‌లో పోరాడింది!!

Mana Enadu: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat).. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. BJP మాజీ MP, రెజ్లింగ్ ఫెడరేషన్(Wrestling Federation of India (WFI)) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్(brij bhushan sharan singh) శరణ్ సింగ్‌ లైంగిక వేధింపుల కేసులో రోజుల తరబడి ఢిల్లీ నడిరోడ్ల మీద ఆందోళన చేసిన భారత మహిళా రెజ్లర్ (Wrestler). బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన రెజ్లర్లల్లో ఆమె ఒకరు. రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగించిన కుస్తీ యోధురాలు. ఒకానొక సమయంలో ఈ అమ్మాయిని తన్ని, చితకబాది వీధుల్లోకి లాగారు కూడా..

కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం..

వినేశ్ మాత్రమే కాదు.. నిరసన తెలిపిన వారిలో బజరంగ్ పునియా(bajrang punia), సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తదితరులున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్‌కు వ్యతిరేకంగా వీరు ఆందోళనలు చేశారు. వీరంతా కలిసి జంతర్ మంతర్ వద్దే ఫుట్‌పాత్‌పై నిద్రించిన రోజులూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ పోడియం నుంచి ఫుట్‌పాత్ వరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ ద్వారా ఎన్నో అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నామని, తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మీడియా ఎదురుగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం.

https://twitter.com/IacGaurav/status/1820790000344023306/video/1

చారిత్రాత్మక విజయం

అలాంటి వినేశ్ ఫొగట్.. పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. పతకం వైపు అడుగులు వేసింది. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో భాగంగా జరిగిన 16వ రౌండ్‌ పోటీల్లో ఘన విజయం సాధించింది. 3-2 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన యుయి సుసాకీని మట్టికరిపించింది. యుయి సుసాకీ అల్లాటప్పా రెజ్లర్ కాదు. వరల్డ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో గతంలో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కూడా అందుకుంది.

ఇక స్వల్ప వ్యవధిలో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ల్లో వినేశ్ తన పట్టేంటో ప్రత్యర్థికి రుచి చూపించింది. అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రొవోకేషన్‌ను 7-5 పాయింట్ల తేడాతో ఓడించింది. దీంతో సెమీస్‌లోకి ఎంటర్ అయింది. కాగా..ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *