NBK@50 కర్టన్ రైజర్.. బాలయ్య గోల్డెన్ జూబ్లీకి ముహూర్తం ఫిక్స్

Mana Enadu:‘‘నటసింహం’’ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తండ్రి నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు బాలయ్య. బాలనటుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆయన ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ మూవీస్ అందించారు. ఇక కెరీర్‌ పరంగా ఎన్నో మైలురాళ్లు బాలయ్య సొంతం. ఈ నందమూరి హీరో ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతోన్నారు. ఆగస్ట్‌ 30వ తేదీతో ఆయన నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50ఏళ్లు కావోస్తోంది. దీంతో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో బాలకృష్ణ గోల్డెన్‌ జూబ్లీ (Balakrishna Golden Jubliee) సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

 సుమారు 129 మంది హీరోయిన్స్‌ ఆడిపాడారు..

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఓ హీరో 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన బాలయ్య.. తన 50 సినీ ప్రస్థానంలో 109 సినిమాల్లో హీరోగా నటించారు.ఆయన సరసన సుమారు 129 మంది హీరోయిన్స్‌ ఆడిపాడారు. ఇండియన్‌ మూవీ హిస్టరీలో అత్యధిక మంది హీరోయిన్లతో నటించిన తొలి నటుడు ఈయనే కావడం విశేషం. ఆయన కెరీర్‌ పరంగా చూస్తే హిస్టారిక్‌, బయోపిక్స్‌, మైథాలాజికల్‌, సైన్స్‌ ఫిక్షన్‌, సోషల్‌ వంటి అన్ని జానర్లలో నటించి రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఆయన 50ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ఘనంగా చాటేందుకు సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ ఇద్దరూ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్ చేశారు.

 బాలయ్య 50ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎవరెవరు ఏమన్నారంటే..

☛ నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ..‘‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగానూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు’’ అని చెప్పారు.

☛ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత ఇన్నేళ్లు నటుడిగా చేసింది బాలయ్యబాబే. ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు. మేమిద్దరం ఒకసారి గోవా వెళ్లినప్పుడు ఒక ట్రే వాటర్ బాటిల్స్ కొని ఆయనే మోసుకొచ్చారు. అంత సింపుల్‌గా ఉంటారు’’ అని అన్నారు.

☛ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘‘రామారావు గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కలిసి టాలీవుడ్ పవర్ ఏంటో చూపించేలా గొప్పగా చేస్తాం’’ అని చెప్పారు.

☛ నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘‘ నందమూరి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలున్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణను రామారావు సొంత తమ్ముడిలా చూసుకునేవారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య నమ్ముతారు. అలాంటి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.’’ అని అన్నారు.

☛ సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..‘‘బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 13 సినిమాలు ఆయనతో చేశానంటే ఆయన ఎంత మంచి వాడో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు’’ అని చెప్పారు.

☛ నటుడు మాదాలరవి మాట్లాడుతూ ‘‘నందమూరి బాలకృష్ణగారి 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.

☛ మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ మాట్లాడుతూ..‘‘నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. బాలయ్య గారికి కంగ్రాట్స్. ఆ ఈవెంట్ కోసం వేచి చూస్తున్నాం. పెద్దలు ఏం చెప్తే అలా చేస్తాం. ఈవెంట్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నా’’ అని అన్నారు.

☛ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను ఒక ప్రతిష్టాత్మక వేడుకగా చేస్తున్నాం. సౌతిండియా నుంచి ఎంతోమందిని ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకను గొప్పగా గుర్తుండిపోయేలా చేస్తాం’’ అని చెప్పారు.

☛ సీనియర్ నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ..‘‘మా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతోందంటే నాకు భయంగా ఉంది. ఆయన సినిమాలు, ఆయన కలెక్షన్స్ అన్నీ రికార్డులకెక్కాయి. ఈ ఫంక్షన్ ఆ రికార్డులన్నింటినీ దాటి ఇంకా గొప్పగా జరగాలనేది నా తాపత్రయం. తప్పకుండా గొప్పగా చేస్తాం’’ అని తెలిపారు.

☛ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘1974 మేలో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అక్కడి నుంచి 50 ఏళ్లు మా కళ్ల ముందు గిర్రున తిరిగి ఇంత దూరం వచ్చేశామా.. అంతా ఓ కలలా ఉంది. ఆయన 50 ఏళ్ల వేడుక అందరికీ స్ఫూర్తిదాయంకంగా ఉండేలా జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

☛ తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..‘‘హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సేవలందరిస్తూ ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. నాలుగు తరాలపాటు రాముడిగా, కృష్ణుడిగా చేసింది ఒక్క నందమూరి కుటుంబమే. ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చేస్తాం’’ అని చెప్పారు.

☛ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..‘‘నేను రామారావుగారి అభిమానిని. నేను అభిమానించిన రామారావుగారికి సినిమా రాయడం అనేది మాకు దొరికిన అదృష్టం. 1981లో నేను ఛండశాసనుడు సినిమాకు రాశాను. ఆ టైమ్‌లో ఒక అందమైన కుర్రాడు వచ్చాడు. అతనే బాలకృష్ణ. ఆయన 50 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్నారంటే నేను షాకయ్యా. 50ఏళ్ల వయసు వచ్చిందేమో అనుకున్నా’’ అని చెప్పారు.

☛ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘‘మన ఇండస్ట్రీలో 50ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణగారి కార్యక్రమంలో అన్ని అసోసియేషన్స్ వాళ్లు పాల్గొనడం సంతోషంగా ఉంది. మా అసోసియేషన్ కూడా పాల్గొనడం మా అదృష్టం’’ అని చెప్పారు.

☛ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ..‘‘50 నిమిషాల పాటు వాక్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50ఏళ్లు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆయనకు సన్మానం చేయడం చాలా అభినందనీయమైన విషయమని అన్నారు.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *