Mana Enadu: రెండోవ తరగతి చదివే విద్యార్దినిపై తొమ్మిదవ తరగతి చదివే విద్యార్ధులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘగన హైదరబాద్ నడిబోడ్డున చోటుచేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. భారతీయ జనతాపార్టీకి చెందిన మహిళా సంఘాల నేతలతోపాటు విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి.
క్లాస్ రూంలోనే ఈ దాడి జరగడంతో ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో స్కూలుకు వెళ్లి ఘటనపై యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే గుట్టుగా పాఠశాల వెంటనే చర్యలు చేపట్టింది. యాజమాన్యం ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి టీసీ ఇచ్చి పంపించగా.. మరో ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. కాగా దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి. దీంతో స్కూల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుంటుంబానికి న్యాయం చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.