రాజ్యసభ ఉప ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే

ManaEnadu:పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.  సెప్టెంబర్‌ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి  కేంద్రమంత్రి రణ్‌వీత్‌ సింగ్‌ బిట్టూ, మధ్యప్రదేశ్ నుంచి మరో యూనియన్ మినిస్టర్ జార్జి కురియన్‌ను అభ్యర్థులుగా బరిలోకి దించింది.

ఒడిశా నుంచి బిజూ జనతాదళ్‌ మాజీ నేత మమత మొహంతను తమ అభ్యర్థిగా ప్రకటించింది.  బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, సీనియర్‌ అడ్వకేట్‌ మనన్‌ కుమార్‌ మిశ్రాను బిహార్‌ నుంచి బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా స్థానాలకు బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపింది.

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఇదే..
సర్దార్‌ రణ్‌వీత్‌ సింగ్‌బిట్టూ – రాజస్థాన్‌
జార్జ్‌ కురియన్‌ – మధ్యప్రదేశ్‌
మిషన్‌ రంజన్‌ దాస్‌, రామేశ్వర్‌ తెలి – అస్సాం (2)
మనన్‌ కుమార్‌ మిశ్రా – బిహార్‌
కిరణ్‌ చౌధరి – హరియాణా
ధైర్యశిల్‌ పాటిల్‌ – మహారాష్ట్ర
మమత మొహంత – ఒడిశా
రజీబ్‌ భట్టాచార్జీ – త్రిపుర

రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Related Posts

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాల సిరల వ్యాధి.. క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్

అమెరికా(US) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)నకు దీర్ఘకాల సిరల వ్యాధి (Chronic Venous Disease)గా నిర్ధారణ అయింది. ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి(Circulatory disease) అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌(White House Press Secretary Carolyn Leavitt) ప్రకటించారు.70…

Elon Musk: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. ‘ది అమెరికా పార్టీ’ ఏర్పాటు చేస్తూ నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు (Big Beautiful Bill)’ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ట్రంప్ తీసుకొచ్చిన బిల్ చట్టరూపం దాల్చితే కొత్త…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *