Mana Enadu : వినియోగదారులకు వెరీ బ్యాడ్ న్యూస్. వాణిజ్య గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటల్స్, రెస్టారెంట్ల (Restaurants)లో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.48.5 మేర పెంచ్తునట్లు తెలిపాయి. అక్టోబర్ 1 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. గృహవినియోగం కోసం ఉపయోగించే, వంట గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.
వరుసగా మూడోసారి పెరిగిన ధరలు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Commercial gas Cylinder Price) ధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. ఆగస్టు నెలలో రూ.6. పెరిగిన ధరలు.. సెప్టెంబర్‌లో ఏకంగా రూ.39 పెరిగాయి. ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌పై రూ.48.5 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ముంబయి మహానగరంలో 19కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price) రూ.1,692.50 పలుకుతోంది. ఇక చెన్నైలో అత్యధికంగా రూ.1,903, కోల్‌కతాలో రూ.1,850.50లకు గ్యాస్ సిలిండర్ అమ్ముడవుతోంది.
చిరువ్యాపారులపై పెను భారం
అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా రూ.48 పెంచడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సరకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతూ తమ నడ్డి విరుస్తున్నాయని వాపోయారు. ఇక ఇప్పుడు ఉరుము ఉరుమి మంగళం మీద పడినట్లు ఇప్పటికే ధరల పెరుగుదలతో సమతమతమవుతున్న తమపై గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల మరింత భారాన్ని మోపుతోందని ఆవేదన చెందుతున్నారు.
వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో నో మార్పు
మరోవైపు ఆయిల్ కంపెనీలు మహిళలకు మాత్రం కాస్త ఊరట కల్పించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803 ఉండగా.. ఉజ్వల లబ్ధిదారుల (Ujjwala Beneficiaries)కు మాత్రం రూ.603కు లభిస్తుంది. ముంబయిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50 ఉండగా.. చెన్నైలో రూ.818.50, హైదరాబాద్‌లో రూ.855, విశాఖపట్నంలో రూ.812గా ఉంది. వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు, పెరుగుదల లేకపోవడంతో మహిళలు, మధ్యతరగతి కుటుంబాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.