ManaEnadu : సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి (Suresh Kondeti) గురించి తెలియని వారుండరు. తరచూ తన కామెంట్స్ తో ఆయన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటారు. అప్పుడప్పుడు ఆయన పలు సినిమాల్లోనూ నటిస్తుంటారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి తాజాగా ఆయన లీడ్ రోల్ లో ఓ మూవీ చేస్తున్నారు.
అభిమాని గ్లింప్స్ రిలీజ్
సురేష్ కొండేటి హీరోగా ‘అభిమాని’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అభిమాని (Abhimani)’ – ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‍లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా.. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది. రాంబాబు దోమకొండ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు నిర్మిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ సురేష్ కొండేటి పుట్టిన రోజు (అక్టోబర్ 6) సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
అదే అభిమాని ముఖ్య ఉద్దేశం
ఈ సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) మాట్లాడుతూ.. ” ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ చాలా బాగుంది. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుంచే తెలుసు. అక్కడి నుండి తన ప్రయాణం జర్నలిస్ట్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా, ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగిన తీరు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది.” అని అన్నారు.
ఆయన చేయి పడితే హిట్ ఖాయం
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. “దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది.
ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్న నన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది రాఘవేంద్రరావే. వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు. ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి వాళ్ళకు గ్రాండ్ సక్సెస్ లు ఇచ్చారు. ఏకంగా నాలుగు తరాలతో కలిసి పనిచేశారు.
అలాంటి రాఘవేంద్రరావు చేతుల మీదుగా… నేను ప్రధాన పాత్ర పోషించిన ‘అభిమాని’ సినిమా గ్లింప్స్ విడుదల కావడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది.” అని తెలిపారు.








